రేపు జిల్లాకు సీఎం రాక
- పర్యటనకు విస్తత ఏర్పాట్లు
విశాఖ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆయన జిల్లా పర్యటించనున్నారు. పర్యటన వివరాలిలా ఉన్నాయి. 30వ తేదీ ఉదయం 7.15 గంటలకి సీఎం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8.30 గంటలకి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ 8.45 గంటల వరకు అధికారులతో సమావేశమవుతారు. 9.30 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి 10 గంటలకు అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళతారు.
దర్శనం అనంతరం కొద్దిసేపు రిజర్వులో ఉంటారు. 11 గంటలకు తుమ్మపాల వెళ్లి 11.30 గంటల వరకు గ్రామస్తులను కలుస్తారు. 11.40 గంటలకు గంధవరం గ్రామస్తులను కలిసి, మధ్యాహ్నం 12.55 గంటలకు చోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళతారు. ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు భోజనం, విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చోడవరం ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో రైతులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్మికులతో సమావేశమవుతారు.
సాయంత్రం 5 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 5.30కు అనకాపల్లి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌కు చేరుకుటారు. అక్కడ 6.30 గంటల వరకు శాస్త్రవేత్తలు, విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. అనంతరం 6.30 నుంచి 7.30 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 7.30 నుంచి 8 గంటల వరకు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
31వ తేదీ.. : 31వ తేదీ ఉదయం 9 నుంచి 11 వరకు ఆర్‌ఏఆర్‌ఎస్‌లోనే ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం 11.15కి కశింకోట బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి 11.45 గంటల వరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11.50కి తాళ్లపాలెం గ్రామానికి వెళ్లి 12.10 గంటల వరకు అక్కడ స్థానికులను కలుస్తారు. 12.20కి యలమంచిలిలో రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.50కి బయ్యవరం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్మికులు, రైతులతో ముచ్చటిస్తారు. అనంతరం 1.10కి అక్కడ నుంచి బయలుదేరి 1.30 గంటలకు ఉపమాక వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
తరువాత 2 గంటల వరకు స్థానికులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.10కి నక్కపల్లికి చేరుకొని అక్కడ భోజనం చేస్తారు. తిరిగి 2.40కి నక్కపల్లిలో బహిరంగ సమావేశంలో ప్రసంగిసాతరు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్‌ను సందర్శించి స్వయం సహాయక బృందాలను కలుస్తారు. సాయంత్రం 5.15కి నక్కపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 5.45 గంటలకు విశాఖకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి 5.55 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు.