రైతులు, కంపెనీల మధ్య పారదర్శక ఒప్పందం
జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రైతులకు, విత్తన కంపెనీలకు మధ్య పారదర్శక ఒప్పందం ఉండాలని, ఆ మేరకు అనేక మార్పులు చేయాలని జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానించింది. వివరాలను విత్తన కాంగ్రెస్ నిర్వహక కమిటీ చైర్మన్ పార్థసారధి వెల్లడించారు.
⇒ రైతులు, కంపెనీలకు మధ్య ఒప్పందంలో మార్పులు
⇒ విత్తన పంటలకు ప్రత్యేక బీమా పథకం
⇒ విత్తన సహకార సంఘాలకు రూపకల్పన
⇒ వ్యవసాయ యాంత్రీకరణను విత్తనరంగంలోనూ విరివిగా వాడాలి
⇒ ప్రాసెసింగ్, క్లీనింగ్ పరికరాలను సబ్సిడీ, రుణాల రూపంలో రైతులకు అందించాలి
⇒ విత్తన పంటలకు కనీస మద్దతుధర
⇒ 15 నెలలపాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీని తీసుకురావాలి
⇒ ప్రభుత్వ, ప్రైవేటు మధ్య విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి
⇒ ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం-1966లో మార్పులు, చేర్పులు
⇒ దేశవ్యాప్తంగా ఒకేరకమైన ఏకీకృత విత్తన శాంపిళ్ల పరీక్ష పద్ధతులు తీసుకురావాలి
⇒ నకిలీ విత్తనాల తయారీ, విక్రయదారులకు కఠిన శిక్షలు విధించాలి
⇒ అంతర్జాతీయంగా నాణ్యమైన విత్తనాలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలి
⇒ లేబరేటరీ వ్యవస్థ ఉండాలి
⇒ విత్తన కంపెనీలకు కీలకమైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయాలి
⇒ గ్రామం యూనిట్‌గా ఐదు నుంచి పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
⇒ విత్తన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారితో ఉద్యోగాల భర్తీ
⇒ బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలపై రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి