రైతులు, కంపెనీల మధ్య పారదర్శక ఒప్పందం | Farmers, companies Between Transparent contract | Sakshi
Sakshi News home page

రైతులు, కంపెనీల మధ్య పారదర్శక ఒప్పందం

Published Fri, Oct 30 2015 2:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Farmers, companies Between Transparent contract

జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రైతులకు, విత్తన కంపెనీలకు మధ్య పారదర్శక ఒప్పందం ఉండాలని, ఆ మేరకు అనేక మార్పులు చేయాలని జాతీయ విత్తన కాంగ్రెస్ తీర్మానించింది. వివరాలను విత్తన కాంగ్రెస్ నిర్వహక కమిటీ చైర్మన్ పార్థసారధి వెల్లడించారు.
రైతులు, కంపెనీలకు మధ్య ఒప్పందంలో మార్పులు
విత్తన పంటలకు ప్రత్యేక బీమా పథకం  
విత్తన సహకార సంఘాలకు రూపకల్పన

వ్యవసాయ యాంత్రీకరణను విత్తనరంగంలోనూ విరివిగా వాడాలి
ప్రాసెసింగ్, క్లీనింగ్ పరికరాలను సబ్సిడీ, రుణాల రూపంలో రైతులకు అందించాలి
విత్తన పంటలకు కనీస మద్దతుధర
15 నెలలపాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీని తీసుకురావాలి
ప్రభుత్వ, ప్రైవేటు మధ్య విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి
ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం-1966లో మార్పులు, చేర్పులు  
దేశవ్యాప్తంగా ఒకేరకమైన ఏకీకృత విత్తన శాంపిళ్ల పరీక్ష పద్ధతులు తీసుకురావాలి
నకిలీ విత్తనాల తయారీ, విక్రయదారులకు కఠిన శిక్షలు విధించాలి
అంతర్జాతీయంగా నాణ్యమైన విత్తనాలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలి
లేబరేటరీ వ్యవస్థ ఉండాలి
విత్తన కంపెనీలకు కీలకమైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయాలి
గ్రామం యూనిట్‌గా ఐదు నుంచి పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
విత్తన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారితో ఉద్యోగాల భర్తీ
బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలపై రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement