చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : వ్యవసాయ రంగాన్ని పరిశ్రమ రంగంగా పరిగణించాలని డాక్టర్ శివమూర్తి మురుఘా శరణులు సూచించారు. నగరంలోని హళేమాధ్యమిక పాఠశాల ఆవరణంలో వినూత్న గ్రామీణ సంస్థ, ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థలు శనివారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రాచీనమైన వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం విచారకరమన్నారు.
మిగతా రంగాలతోపాటూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తే చేనేత, కుటీర పరిశ్రమలు మనుగడ సాగిస్తాయన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి వ్యవసాయ ఉత్పత్తులకు మద ్దతు ధర కల్పించాలన్నారు. ఫలితంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.
వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీహెచ్. తిప్పారెడ్డి, ధర్మస్థల అధికారి సుబ్రమణ్యం ప్రసాద్, బేబీ, మంజునాథ్, ఇతర ప్రముఖ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ వస్తువుల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది.
వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి
Published Sun, Feb 9 2014 2:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement