త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ముప్పు
అరక్కోణం(తమిళనాడు): గౌహతి- త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ రైలుకు తమిళనాడులోని అరక్కోణం సమీపంలో ప్రమాదం తప్పింది. ఏ1 ఏసీ కోచ్‌లో విద్యుత్ మోటర్లు ఊడిపోవడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మత్తుల అనంతరం ఆరుగంటల ఆలస్యంగా రైలు అక్కడి నుంచి బయల్దేరింది.