'మూడే'స్తే చాలంటే..
న్యూయార్క్: నిండు జీవితానికి రెండు పోలియో డ్రాప్స్ చాలు.. ఈ మాట ప్రతి ఏడాది పోలియో డ్రాప్స్ కోసం ప్రభుత్వం రూపొందించిన యాడ్లో వింటూ, చూస్తునే ఉంటాం. కాగా శృంగార జీవితానికి మాత్రం ప్రతి రోజూ రెండు లేదు మూడు కాఫీ కప్పులు పుచ్చుకుంటే చాలంట. శృంగార జీవితం ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫిగా సాగిపోతుందట. ఆ విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లోని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెప్పారు.
హ్యూస్టన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, రచయిత, ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ ఎస్ లోపెజ్ మాట్లాడుతూ... ఈ లెక్కన కాఫీ తాగని వారిలో కంటే 'మూడు' సార్లు కాఫీ తాగే వారిలో అంగస్తంభన అధికంగా ఉంటుందని తెలిపారు. కాఫీ తక్కువ మోతాదులో అంటే 85 నుంచి 170 మిల్లీ గ్రాములు తీసుకున్న వారిలో అంగస్తంభన 42 శాతం తక్కవ అవకాశం ఉందన్నారు.
అలాగే 171 నుంచి 303 మిల్లీ గ్రాములు తీసుకున్న వారిలో ఈ సమస్య 39 శాతం ఉందని చెప్పారు. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుందని ... ఇది పురుషాంగంలో రక్తప్రసరణ సజావుగా సాగేలా తోడ్పాడుతుందని వివరించారు.అధిక స్థూలకాయం, అధిక బరువు, హైపర్ టెన్షన్ అనేవి శృంగార జీవితానికి అతి పెద్ద సమస్యలని చెప్పారు.