ఉద్ధవ్‌కు టెన్నిస్ టైటిల్
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ టెన్నిస్ టోర్నీ బాలుర అండర్-14 విభాగంలో ఉద్ధవ్ ఠాకూర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సైనిక్‌పురిలోని కార్నివాల్ క్లబ్లో శ నివారం జరిగిన ఫైనల్లో ఉద్ధవ్ 7-4తో యశోధన్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఉద్ధవ్ 6-3తో రాహుల్‌పై, యశోదన్ 6-4తో అభిషేక్‌పై నెగ్గారు. అండర్-12 విభాగంలో రాహుల్ 7-2తో శశిధర్‌పై గెలిచి విజేతగా నిలిచాడు.
బాలికల అండర్-12 విభాగంలో అమూల్య 7-3తో నిఖితపై గెలుపొందింది. బాలుర అండర్-12 డబుల్స్ విభాగంలో లోకాదిత్య-కృష్ణారెడ్డి జోడి 6-5తో కౌషిక్-యశ్వంత్‌పై నెగ్గి టైటిల్ సాధించారు. వీరితో పాటు అండర్-14 డబుల్స్‌లో ఆదిత్య-సాయి కృష్ణ జోడి 6-1తో లోకాదిత్య-నిహాల్ జంటపై విజయం సాధించింది. బాలికల అండర్-12 డబుల్స్ విభాగంలో సంజన-సృజన జోడి 6-2తో అమాండా గ్జేవియర్-సాహ్విత రాజ్ జోడిపై గెలిచి విజేతగా నిలిచింది.