2012లో 4.5 లక్షల మంది హత్య
ఒక్క ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మంది హత్యకు గురయ్యారా అంటే అవుననే అంటున్నాయి ఐక్యరాజ్యసమితి లెక్కలు. 2012 ఒక ఏడాదిలో 437,000 మంది హత్యకు గురైయ్యారని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని డ్రగ్స్ అండ్ క్రైమ్ లెక్కల విభాగం గురువారం వెల్లడించింది. సర్వే నివేదికను గురువారం విడుదల చేసింది. హత్యల జాబితాలో అమెరికా అగ్రస్థానం అక్రమించగా ఆఫ్రికా ఆ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది.
ఆసియా, ఐరోపా దేశాలు చివరిస్థానాలలో నిలిచాయని పేర్కొంది. హత్యకు గురైన వారిలో 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని చెప్పింది. హత్యకు గురైన ప్రతి పది మందిలో ఎనిమిది మంది పురుషులు హత్య కావించబడ్డారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గృహ హింస వల్ల15 శాతం మంది మహిళలు చనిపోయారని పేర్కొంది.