స్విమ్మింగ్ పూల్‌లో యంగ్ క్రికెటర్ దుర్మరణం
సాక్షి, కోలంబో: శ్రీలంక టూర్‌కి వెళ్లిన ఓ యువ క్రికెటర్ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. పమునుగమలోని ఓ స్టార్ హోటల్ లో ఘటన చోటుచేసుకుంది.
శ్రీలంకలో నిర్వహిస్తున్న అండర్ 17 టోర్నమెంట్ లో భాగంగా గుజరాత్‌కు చెందిన 12 ఏళ్ల కుర్రాడు 19 మంది టీమ్ సభ్యులతోపాటు విల్లా పామా హోటల్లో బసచేశాడు. మంగళవారం సాయంత్రం స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఆ సమయంలో అక్కడే మరో నలుగురు ఆటగాళ్లు ఉన్నప్పటికీ వాళ్లు ఏం కాపాడే ధైర్యం చేయలేకపోయారని సమాచారం.
ఆపై అతన్ని హోటల్ సిబ్బంది సహకారంతో బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.