University staff
-
ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ, స్టాఫర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న వేతనాల సవరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ సవరణతో ఉద్యోగుల వేతనాలు సగటును 15 శాతం మేర పెరుగనున్నాయి. గురుపూర్ణిమ(జూలై9) సందర్భంగా వీరికి గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను సిద్ధం చేసిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని కేబినెట్ ముందుకు తీసుకువస్తోంది. దీనిపై కేబినెట్ ఆమోదం తెలుపగానే, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన ఎనిమిది లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు 15 శాతం మేర వేతనాలు పెరుగనున్నాయని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్ల ఫ్యాకల్టీ, స్టాఫ్ లకు కూడా ఈ మేరకునే వేతనాలను పెంచనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై మూడేళ్ల వరకు రూ.75వేల కోట్ల భారం పడనుందని వెల్లడైంది. ఈ విషయంపై పీఎంఓ సోమవారమే సమావేశం ఏర్పాటుచేసింది. చివరి సారిగా వీరి వేతనాలను 2006లో పెంచారు. సివిల్ సర్వెంట్ కంటే అధికంగా వీరి వేతనాలు అప్పట్లో పెంచారు. ఈ వేతనాల పెంపుతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన కాలేజీలు, యూనివర్సిటీల 7.5-8లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన 30వేల మంది ఉద్యోగులకు, కేంద్రప్రభుత్వంతో నడిచే టెక్నికల్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన 30వేల మందికి ప్రయోజాలను చేకూరనున్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్ల వరకు ఈ వేతనాల పెంపు అమలు ఉంటుందని, 7వ వేతన సంఘ సిఫారసుల మేరకే వీరికి సగటున 15 శాతం ఇంక్రిమెంట్ చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే 20 శాతం వరకు పెంపు చేపట్టాలని యూజీసీ రిపోర్టు చేసింది. -
యూనివర్సిటీ సిబ్బందికి పీఆర్సీ
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 43 శాతం ఫిట్మెంట్ మార్చి నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: అన్ని యూనివర్సిటీలు, జేఎన్టీయూలోని నాన్ టీచింగ్ సిబ్బంది వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పదో పీఆర్సీ సిఫారసుల మేరకు కరువు భత్యం(డీఏ), ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ), సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్(సీసీఏ), ఆటోమెటిక్ అడ్వాన్సుమెంట్ స్కీంలు అమలవుతాయని.. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన జీవోలు యూనివర్సిటీ సిబ్బందికి వర్తిస్తాయని అందులో స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ బుధవారం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో ఉన్న ముఖ్యాంశాలివి.. 2013 జూలై నుంచి ఉన్న మూల వేతనానికి 43 శాతం ఫిట్మెంట్, కరువు భత్యం విలీనం చేసి మూల వేతనాన్ని స్థిరీకరిస్తారు. 2013 జూలై నుంచి 2014 జూన్ ఒకటో తేదీ వరకు ఉన్న బకాయిలను నోషనల్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి నెల వేతనం నుంచి పెరిగిన జీతాలు చెల్లిస్తారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిల చెల్లింపులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో దాటవేసిన విధంగానే బకాయిలకు తదుపరి ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటించింది. 2014 జనవరి నుంచి 2014 జూన్ ఒకటి వరకు ఉద్యోగులు పొందిన ఇంటీరియమ్ రిలీఫ్‌ను రికవరీ చేయరు. అప్పటినుంచి ఇప్పటివరకు చెల్లించిన ఇంటీరియమ్ రిలీఫ్ మొత్తాన్ని త్వరలో చెల్లించనున్న బకాయిల్లో నుంచి ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుంది. వేతన సవరణ చేసుకోకుండా పాత వేతనాలతో కొనసాగే ఉద్యోగులకు 2015 మార్చి నెల నుంచి ఇంటీరియమ్ రిలీఫ్‌ను నిలిపివేస్తారు. సిబ్బంది వేతన సవరణతో పెరిగే అదనపు భారాన్ని యూనివర్సిటీలు తమ దగ్గరున్న ఆర్థిక వనరులతోనే సర్దుబాటు చేసుకోవాలని.. అదనపు నిధులు ఆశించవద్దని ఈ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.