‘ఉపేంద్ర గాడి అడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్: ఉపేంద్ర గాడి అడ్డా
నటీనటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, మురళీధర్ గౌడ్, అప్పారావు, కిరీటి దామరాజు, సంధ్య జనక్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్ఎల్ ఎస్ క్రియేషన్స్
నిర్మాత: కంచర్ల అచ్యుతరావు
దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్. కె
విడుదల తేది: డిసెంబర్ 1, 2023
కథేంటంటే..
ఉపేంద్ర(కంచర్ల ఉపేంద్ర) బంజారాహిల్స్ ని ఓ బస్తీ కుర్రాడు. డిగ్రీ వరకూ చదువుకున్నా... ఈజీగా మనీ సంపాధించి సెటిల్ అయిపోవాలనునుకునే కుర్రాడు. అందుకోసం ఓ ధనవంతురాలిని పెళ్లి చేసుకోవాలని అప్పులు చేసి... పబ్ ల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సావిత్రి(సావిత్రి కృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె గొప్పింటి అమ్మాయి అనుకుని... తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి... ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే తన గురించి ఆమెకు నిజం చెప్పాలని అనుకుని... తాను ధనవంతుడిని కాదని... బంజారాహిల్స్ లో ఓ బస్తీ కుర్రాడిని అని చెబుతాడు. మరి ఆ బస్తీ కుర్రాడిని... సావిత్రి పెళ్లి చేసుకుందా? అసలు సావిత్రి ఎవరు? వీరిద్దరికీ పెళ్లి అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
యువతను ఆకట్టుకునే అంశాలతో మంచి సందేశం అందించిన చిత్రమిది. నేడు సోషల్ మీడియా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో... దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మాయిలు సోషియల్ మీడియా ప్రభావంతో తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే దానిని చాలా బాగా చూపించారు.
సోషియల్ మీడియాలో అబ్బాయిలు... అమ్మాయిలను ఎలా మోసం చేసి... చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు? దాని వల్ల వారు చేసే క్రైం ని ద్వితీయార్థంలో దర్శకుడు చక్కగా చూపించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లల జీవితాలను ఎంత ప్రమాదంలోకి నెడుతోందనేదాన్ని చూపించారు వారి తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా చూపించడం బాగుంది. రొటీన్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం సరదాగా సాగిపోతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఇక సెకండాఫ్లో కథ స్లోగా సాగుతుంది. మంచి సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. సోషియల్ మీడియా ప్రభావంతో యువతులు ఎలా మోసపోతున్నారనే దాన్ని ఈ చిత్రం ద్వారా చూపిస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు.
ఎవరెలా చేశారంటే..
కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడైనా చాలా చక్కగా నటించారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి... మాస్ ను ఆకట్టుకున్నాడు. ఓ బస్తీ కుర్రాడు ఎలా ఉంటారో అలాంటి మాస్ లుక్ తోనూ... మరో వైపు రిచ్ కిడ్ గానూ రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు.. ఉపేంద్రకు జోడీగా నటించిన సావిత్రి కృష్ణ కూడా బాగా చేసింది. బాధ్యత గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ కూడా బాగా నవ్వించారు.
అలాగే జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు కాసేపు ఉన్నా నవ్వించారు. బలగం మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. సోషియల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... అమ్మాయిలను మోసం చేసే పాత్రలో కిరీటి దామరాజు పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా సంధ్య జనక్, బస్ స్టాప్ కోటేశ్వరరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. సంగీతం మాస్ ను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.