శంషాబాద్ మండలంలో బస్సు బోల్తా
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కోండ వద్ద శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూలు బస్సు బోల్తాపడింది. బస్స పఠాన్‌చెరువు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకుఏ సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.