భళా.. వేంగి కళ
చారిత్రక నగరం హేలాపురిలో వేంగి కళా ఉత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల శాస్త్రీయ, జానపద నృత్య కళారీతులను ప్రదర్శిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్య విన్యాసమిది.
గజ్జె ఘల్లున.. గుండె ఝల్లున
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన శ్రీ లలితా కామేశ్వరి నృత్య సదనం ఆధ్వర్యంలో నాట్యాచారిణి ఘండికోట అలివేలు ఉష నిర్వహణలో శుక్రవారం ప్రారంభమైన వేంగి కళా ఉత్సవాలు అలరించాయి. అంతర్జాతీయ స్థాయి నృత్య కళాకారుల నృత్యప్రదర్శన కళాకారులను రంజింపజేశాయి. నవీ ముంబైకి చెందిన అపేక్ష ముందర్జీ భరతనాట్యం, గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్యం నగరవాసులను విపరీతంగా అలరించాయి. అలాగే చెన్నైకి చెందిన అమర్నాథ్ ఘోష్ కథక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.