Ventilators
-
పనిచేయని పీఎం కేర్ వెంటిలేటర్లు: ఆస్పత్రుల్లో వృథాగా
చండీఘడ్: కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదని మూలకు పడేశారు. దీంతో పీఎం కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకం వెంటిలేటర్లు ఇస్తే ఏం ప్రయోజనమని మండిపడ్డారు. పీఎం కేర్ నిధుల నుంచి అగ్వా హెల్త్ కేర్ కార్యక్రమంలో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి గతేడాది 250 వెంటిలేటర్స్ పంపించారు. వాటిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే పంపించిన వాటిలో చాలా వరకు పని చేయడం లేదని పక్కకు పడేశారు. గురు గోబింద్ సింగ్ వైద్య కళాశాల, ఆస్పత్రికి 80 వెంటిలేటర్స్ పంపించాల్సి ఉండగా 71 పంపారు. ఆ పంపిన వాటిలో ఒక్కటీ కూడా పని చేయడం లేదని ఆ కళాశాల వీసీ ఆరోపించారు. గంటా రెండు గంటలు పని చేయగానే మొరాయిస్తాయని తెలిపారు. దీంతో వాటిని పక్కన పడేసినట్లు తెలిపారు. పంపిన వెంటిలేటర్లు నాసిరకమైనవని.. అవి కొంత సేపు పని చేసి ఆగిపోతున్నాయని పలు ఆస్పత్రులు ఫిర్యాదు చేశాయి. నాణ్యమైన వెంటిలేటర్లు పంపలేదని అనస్థిషియా వైద్యులు చెబుతున్నారు. తరచూ మొరాయిస్తున్నాయని అని బాబా ఫరీద్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రాజ్ బహదూర్ వాపోయారు. ‘82 వెంటిలేటర్లు ఇవ్వగా వాటిలో 62 పని చేయడం లేదని ఫొటోతో సహా తెలిపారు. అవి తీసుకు వచ్చినప్పటి నుంచి పని చేయడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 42 వెంటిలేటర్లతో రోగులకు సేవలు అందిస్తున్నాం. రోగులకు వాటిని అందుబాటులో ఉంచలేం’ అని పేర్కొన్నారు. These r the ventilators fm #PMCaresFund lying unused in GGSMC Faridkot. @CMOPb pls make them work for the needy #COVID19 patients....I shall be Obliged..and Appreciate....@ChitleenKSethi @ANI @AAPPunjab @CsPunjab pic.twitter.com/GV9lUZBlox — Kultar Singh Sandhwan (@Sandhwan) May 11, 2021 ఇదే విషయాన్ని పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంద్వాన్ ట్వీట్ చేశారు. ఆ వెంటిలేటర్ల దుస్థితిని ఫొటో పంచుకున్నారు. ఫరీద్‌కోట్‌లోని ఆస్పత్రిలో నిరుపయోగంగా వెంటిలేటర్లు పడి ఉన్నాయి. కరోనా రోగుల కోసం వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోండి.’ అని కుల్తార్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రికి ట్యాగ్ చేశారు. ఈ విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్లను మరమ్మతు చేసేందుకు మెకానిక్‌లను పంపించింది. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ప్రస్తుతం ఎంతో అవసరం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవి పని చేస్తాయో.. లేదా మళ్లీ కొన్నాళ్లకు మొరాయిస్తాయోనని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
ఫ్యాక్టరీ కప్పులపై టర్బో వెంటిలేటర్ ఎందుకు ఏర్పాటు చేస్తారు?
మనం ఏదైనా పెద్ద పారిశ్రామిక ప్రదేశాలను సందర్శించినప్పుడు లేదా మీ దగరలో ఉన్న పారిశ్రామిక కర్మాగారాల పైకప్పులపై కర్మాగారాల పైకప్పులపై స్టెయిన్లెస్ స్టీల్‌తో చేసిన చిన్న గుండ్రని గోపురాలను మీరు చూసి ఉంటారు. అయితే, గుండ్రంగా తిరుగుతూ ఉన్న వాటిని పైన ఎందుకు ఏర్పాటు చేస్తారో మీకు తెలుసా?. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరికరాన్ని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు. దీనిని ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్ట్రాక్టర్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. ప్రస్తుతం టర్బో వెంటిలేటర్లను కర్మాగారాలు, పెద్ద దుకాణాలలో మాత్రమే కాకుండా, పెద్ద పెద్ద ప్రాంగణాల్లో, రైల్వే స్టేషన్ల పైకప్పులపై కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చాలా మితమైన వేగంతో నడుస్తాయి. కర్మాగారాలలో ఉండే లోపలి వేడి గాలులను పైకప్పు ద్వారా బయటికి పంపించడం వీటి ప్రధాన పని. ఇలా వేడి గాలులను బయటకి పంపించినప్పుడు కిటికీలు, ప్రధాన ద్వారాల నుంచి తాజా సహజమైన గాలులు ఫ్యాక్టరీలలో ఎక్కువసేపు ఉంటాయి. దీని వల్ల ఆ కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. టర్బో వెంటిలేటర్ ద్వారా వేడి గాలులతో పాటు కర్మాగారాల నుంచి వెలువడే వచ్చే చెడు, కెమికల్ వాసనను బయటకి పంపించడానికి సహాయ పడుతుంది. అలాగే వాతావరణం మారినప్పుడు లోపల ఉన్న తేమను కూడా బయటకు పంపిస్తుంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
భారత్‌కు బాసటగా 40 దేశాలు
న్యూఢిల్లీ: కరోనాతో యుద్ధం చేస్తున్న భారత్‌కు 40కి పైగా దేశాలు సాయం అందించడానికి ముందుకు వచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష ష్రింగ్లా వెల్లడించారు. ఆయా దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు, ఔషధాలు, వెంటిలేటర్లు, ఇతర సామాగ్రి రానున్నాయని చెప్పారు. రష్యా నుంచి 20 టన్నుల వైద్య సామాగ్రి భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వివిధ దేశాల నుంచి 500కి పైగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 4 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 10వేలకు పైగా ఆక్సిజన్ సిలండర్లు, 17 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, రెమిడెసివర్, ఫెవిపిరావిర్ వంటి యాంటీ వైరల్ ఇంజెక్షన్లు 8 లక్షల డోసులకుపైగా త్వరలోనే భారత్‌కు చేరుకుంటాయని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా రోజుకి 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నీ ఆపన్న హస్తం అందిస్తున్నాయని తెలిపారు. అమెరికా: భారత్‌ని ఆదుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా 10 కోట్ల డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని పంపించనున్నట్టు వైట్‌హౌస్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం రోజుల పాటు విడతల వారీగా ఈ సామగ్రిని పంపనుంది. అమెరికాలో కరోనా విలయతాండవం చేసినప్పుడు భారత్ తన శక్తి మేర సాయం అందించిందని , అందుకే అవసరంలో ఉన్న భారత్‌ను తాము ఆదుకుంటామని ఆ ప్రకటన వివరించింది. అమెరికా నుంచి అందనున్న సాయం ► వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు ► 1.5 కోట్ల ఎన్–95 మాస్కులు ► 10 లక్షల ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు ► 2 కోట్ల ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా డోసులు ► ఇప్పటికే తొలి విడత సాయంగా వైద్య పరికరాలను తీసుకొని అమెరికా నుంచి మూడు కార్గో విమానాలు బయల్దేరాయి. రష్యా: రష్యా నుంచి 22 టన్నుల వైద్య సామాగ్రి భారత్‌కు చేరుకుంది. రెండు కార్గో విమానాల్లో ఈ సామాగ్రి ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం ఉదయం చేరుకున్నట్టుగా భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుడాషెవ్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్ మధ్య టెలిఫోన్ చర్చల ఫలితంగా ఆ దేశం తక్షణ అవసరంగా వైద్య సామాగ్రిని పంపింది. ఇందులో 20 ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు, 75 వెంటిలేటర్లు, 150 మెడికల్ మానిటర్స్, 2 లక్షల మందులు ప్యాకెట్లు ఉన్నాయి. బ్రిటన్ నుంచి 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ భారత్‌కి చేరుకున్నాయి. -
రెమిడిసివర్ కోసం మెడికల్ ఆఫీసర్ కాళ్లుపట్టుకున్న మహిళ
లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. యూపీలోని ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పోందుతున్న బాధితుడికి యాంటి వైరల్ డ్రగ్.. రెమిడిసివర్ లభించలేదు. దీంతో వారి కుటుంబీకులు భయాందోళన చెందారు. అదే సమయంలో అక్కడికి మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓరి వచ్చారు. ఇది చూసిన రోగి బంధువు ఒక్కసారిగా మెడికల్ ఆఫీసర్ పాదాలు పట్టుకుని కన్నీటిపర్యంతమైంది. ఎలాగైనా రెమిడిసివర్ ఇచ్చి తమ వారిని కాపాడాలని అభ్యర్థించింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అక్కడ రోగులందరూ దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ సంఘటన అక్కడ కేసుల తీవ్రత, మందుల కోరత ఏ మేరకు ఉందో తెలియజేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది చాలా బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వివారాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మరాఠీల ధన్యవాదాలు
సాక్షి ముంబై: మహారాష్ట్రకు వెంటిలేటర్లను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పలు సందేశాలు ముఖ్యంగా మరాఠీ సందేశాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉంది. కరోనా బాధితులకు ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్లు కూడా లభించడంలేదు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాయం కోరారు. కాగా, వెంటనే 300 వెంటిలేటర్లు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నితిన్ గడ్కరీ ఏపీ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన అనంతరం సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి గడ్డు పరిస్థితిలో సాయం చేసి మానవత్వాన్ని చాటిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో కన్పించాయి. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు) -
సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: అడిగిన వెంటనే నాగపూర్‌కు వారం రోజుల్లో 300 వెంటిలేటర్లు సరఫరా చేసినందుకుగాను సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నితిన్ గడ్కరీ ఫోన్ చేసి సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (నేడు అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు) -
విజృంభిస్తున్న కరోనా.. నెలరోజుల్లో నాలుగింతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ అంత కంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. నెల రోజుల్లోనే ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా గత నెల మూడో తేదీన కరోనాతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య 1,115 ఉండగా, ఈ నెల ఆ సంఖ్య ఏకంగా 4,057కు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై 1,165 మంది, ఆక్సిజన్‌పై 1,940 మంది చికిత్స పొందుతున్నారు. నెలరోజుల్లో 15.5 లక్షల పరీక్షలు చేయగా, అందు లో 12,734 మందికి కరోనా సోకింది. గత నెల మూడో తేదీన 152 కేసులు నమోదైతే, ఈ నెల మూడో తేదీన ఏకంగా 1,321 కేసులు నమోదు అయ్యాయి. అలాగే నెల రోజుల్లో ఏకంగా 80 మంది మృతి చెందారు. అలాగే లక్షణాలు లేకుండా కరోనాకు గురైనవారు గతంలో 70 శాతం ఉంటే, ఇప్పుడు అది 78.5 శాతానికి చేరుకుంది. మొత్తం కేసులు 3.12 లక్షలు.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,03,92,927 నిర్ధారణ పరీ క్షలు చేయగా, అందులో 3,12,140 కేసులు నమోదయ్యాయి. శనివారం 62,973 టెస్ట్‌లు చేయగా, అందులో 1,321 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 మంది కరోనా బారినపడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 293 మంది కోలుకోగా, ఇప్పటివరకు 3,02,500 మంది రికవరీ అయ్యారు. ఒక రోజులో ఐదుగురు చనిపోగా, ఇప్పటివరకు 1,717 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 3,866 మంది ఉన్నారని తెలిపారు. 14.38 లక్షలకు చేరుకున్న టీకాలు.. శనివారం 45 ఏళ్లు దాటిన 41,488 మందికి మొదటి డోస్ టీకా వేశారు. అలాగే వైద్య సిబ్బందిలో 1,035 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,009 మంది మొదటి డోస్ వేసుకున్నారు. అలాగే తాజాగా ఒక్క రోజులో రెండో డోస్ తీసుకున్నవారు 10,872 మంది ఉన్నారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాలు వేసుకున్నవారి సంఖ్య 14,38,828 చేరిందని శ్రీనివాసరావు తెలిపారు. -
పీఎం కేర్స్ నిధి : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్‌కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు. పీఎం-కేర్స్ ఫండ్ నుండి 893.93 కోట్ల రూపాయలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందినట్టు లోక్‌సభలో ప్రకటించారు. 50 వేల వెంటిలేటర్ల తయారీకి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆదివారం కరోనాపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. కరోనా కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది వలస కార్మికుల పునరావాసం కోసం పీఎం కేర్స్ నిధులు కేటాయించాలని కూడా రంజన్ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రణాళికను అమలు చేసి ఉండి ఉంటే, ప్రజలు కష్టాలను, మహమ్మారి తీవ్రతను నివారించ గలిగేవారమన్నారు. అంతేకాదు దేశంలో కోవిడ్-19 మరణాలపై సరైన సమాచారం లేదని కూడా రంజన్ చౌదరి విమర్శించారు. కాగా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫండ్‌ను మార్చి 27న ప్రకటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ .3,076 కోట్లు వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉండగా, మరో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు అవసరంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఆడిట్‌ను డిమాండ్ చేస్తోంది. -
గాంధీ హౌస్‌ఫుల్.. వెంటిలేటర్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా శ్వాస సంబంధ సమస్య తలెత్తింది. ఆయనకు వెంటిలేటర్ సహాయం అవసరమైంది. ఆస్పత్రిలో 105 వెంటిలేటర్లు ఉండగా, అప్పటికే అవన్నీ రోగులతో నిండిపోయాయి. బాధితున్ని గాంధీకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు బాధితుని బంధువులకు సూచించారు. విధిలేని పరిస్థితుల్లో శనివారం రాత్రి అతికష్టం మీద గాంధీకి తీసుకొచ్చారు. తీరా.. ఇక్కడ వెంటిలేటర్లు ఖాళీ లేవని వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని, ఇందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగినంత చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా పాలకుర్తికి చెందిన వ్యక్తికి మాత్రమే కాదు..కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న అనేక మంది ఆఖరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), కింగ్‌కోఠిలో 50, ఛాతి ఆస్పత్రిలో 28 వెంటిలేటర్ల చొప్పున ఉన్నప్పటికీ..టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వల్ల వాటిని పూర్తిస్థాయిలో వినియోగించలేక పోతున్నారు. గాంధీ ఐసీయూ హౌస్‌ఫుల్ 1890 పడకల సామర్థ్యం ఉన్న ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధారణ ఐసోలేషన్ వార్డులో 390 పడకలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 మంది చికిత్స పొందుతున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేయగా, వీటిలో 117 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కీలకమైన ఐసీయూలో 500 వెంటిలేటర్ పడకలు ఉండగా, ప్రస్తుతం ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటిలేటర్ దొరకని పరిస్థితి. అంతేకాదు ఆక్సిజన్, సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికైనా వెంటిలేటర్ అనివార్యమైతే..అప్పటికప్పుడు ఇతరులకు అమర్చిన వెంటిలేటర్ తొలగించి అవసరమైన వారికి అమర్చాల్సి వస్తుంది. కొత్తగా ఆస్పత్రికి చేరుకున్న వారికి వెంటిలేటర్ కావాలంటే..ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ..సమకూర్చలేని దుస్థితి. విధిలేని పరిస్థితుల్లో చాలా మందిని సాధారణ ఆక్సిజన్‌తోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. పలు ఆ స్పత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే కాదు...సికింద్రాబాద్, మాదాపూర్, మలక్‌పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడలోని పలు ప్రతిష్టాత్మాక కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూ వెంటిలేటర్ పడకలు కూడా దాదాపు నిండిపోయాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ..వాటిలో చేరేందుకు వెనుకాడుతున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ...ప్రతిష్టాత్మాక ఆయా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చేరాలని భావిస్తున్నారు. రోగుల బంధువుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా ఆస్పత్రులు ఆసరాగా చేసుకుంటున్నాయి. అడిగినంత చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే ఐసీయూ పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.9000 ధర నిర్ణయించగా..ఆయా ఆస్పత్రులు ఒక్కో వెంటిలేటర్ రోగి నుంచి రోజుకు రూ.80 నుంచి 90 వేల వరకు వసూలు చేస్తున్నాయి. బాధితులు చెల్లించిన డబ్బుకు కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్న ఆయా కార్పొరేట్ ఆస్పత్రులపై 1200పైగా ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు రెండు మినహా మరే ఇతర ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ప్రేవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు అంటూ ఖరారు చేయక పోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. -
‘రాహుల్ గాంధీ డాక్టర్ కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నుంచి నాసిరకం వెంటిలేటర్లను కొనుగోలు చేయడం ద్వారా నరేంద్ర మోదీ సర్కార్ ప్రజాధనం వృధా చేసిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వెంటిలేటర్ తయారీ సంస్థ అగ్వా హెల్త్‌కేర్ స్పందించింది. రాహుల్ గాంధీ డాక్టర్ కాదని, తమ ఉత్పత్తి గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదం స్వయం సమృద్ధ భారత్‌కు అనుగుణంగా కరోనా వైరస్ చికిత్సకు పీఎం కేర్స్ నిధులతో స్వదేశీ కంపెనీ అగ్వా ద్వారా వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. అయితే నాసిరకం వెంటిలేటర్లను కొనుగోలు చేశారని రాహుల్ గాంధీ ఈనెల 5న ట్వీట్ చేశారు. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడంతో పాటు ప్రజాధనాన్ని నాసిరకం ఉత్పత్తుల కోసం ఖర్చు చేశారని దుయ్యబట్టారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై అగ్వా హెల్త్‌కేర్ సహవ్యవస్ధాపకులు ప్రొఫెసర్ దివాకర్ వైష్ స్పందిస్తూ రాహుల్ డాక్టర్ కాదని..ఆయన చాలా తెలివైనవారని, కానీ ఈ ఆరోపణలు చేసే ముందు ఆయన తమ ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండేదని అన్నారు. ఆయన వైద్యులను సంప్రదించి ఉండాల్సింది..ఏ రోగిపై ఏ ఆస్పత్రిలోనైనా తమ వెంటిలేటర్లపై సవివరంగా వాటి పనితీరును వివరించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. దేశీ ఉత్పత్తులను వాడే సందర్భాల్లో ఇలాంటి అసత్య ప్రచారం తెరపైకి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైనిక పరికరాలను స్వదేశీ తయారీదారుల నుంచి కొనుగోలు చేసినప్పుడు సైతం ఇదే తరహా నెగెటివ్ సమీక్షలు వచ్చాయని గుర్తుచేశారు. చదవండి : ‘ఆయనకు కమీషన్లపైనే కన్ను’ 10 లక్షల రూపాయల ఖరీదైన వెంటిలేటర్ పనితీరును కనబరిచే వెంటిలేటర్‌ను తాము లక్షన్నరకే సరఫరా చేస్తున్నామని దీన్ని అంతర్జాతీయ సరఫరాదారులు అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తమను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ వెంటిలేటర్‌ను ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి తిరస్కరించలేదని అన్నారు. ఇక ముంబైలోని జేజే ఆస్పత్రి, సెంట్‌జార్జ్ ఆస్పత్రుల్లో తమ వెంటిలేటర్లను థర్డ్ పార్టీ ద్వారా అమర్చారని, అవి సరిగ్గా అమర్చకపోవడంతో వైద్యులు వాటిని వాడలేకపోయారని వివరణ ఇచ్చారు. పెట్రోల్‌కు బదులుగా డీజిల్ వాడితే ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. -
2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు ఉచితం
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు కలిపి 2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లు, 11,000 వెంటిలేటర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి అదనంగా 11,300 'మేక్ ఇన్ ఇండియా' వెంటిలేటర్లను 6,154 ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు తెలిపింది. కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన చర్యలపై కేంద్రం అన్ని రాష్ర్ట ప్రభుత్వాలతో సమీక్షిస్తూ అవిశ్రామంగా కృషి చేస్తుందని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ కట్టడి కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పెంచడంతో పాటు అనుబంధంగా వైద్ర సామాగ్రిని కేంద్రం ఉచితంగా అందిస్తోందని తెలిపింది. ఇప్పటికే 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, 6.12కోట్లకు పైగా హెచ్‌సిక్యూ టాబ్లెట్లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. (వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన ) ‘దేశంలో కరోనా వెలుగు చూసిన కొత్తలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కుల కోసం విదేశీ మార్కెట్‌పై ఆధారపడాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో వీటికి కొరత కూడా ఉండేది. అయితే అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ), సహా మరికొన్ని శాఖల సమన్వయంతో పిపీఈ కిట్లు, ఎన్95 కిట్లు, వెంటిలేటర్లు సహా అత్యవసర సామాగ్రిని దేశీయంగానే తయారుచేశాం. ఫలితంగా 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' లకు బలం చేకూర్చేలా మన దేశంలోనే వైద్య పరికరాలను తయారుచేశాం'’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. (మాస్క్ ఉన్నా 4 నిమిషాల్లోపైతేనే ‘లో రిస్క్’! ) -
రాష్ట్రాలకు 50 వేల ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. కరోనాతో పోరాడటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 50,000 ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎమ్-కేర్స్ ఫండ్ నుంచి రూ .2,000 కోట్లు విడుదల చేసింది. అంతేకాక ఇప్పటివరకు 2,923 వెంటిలేటర్లను తయారు చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఇప్పటికే 1,340 వెంటిలేటర్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలు కూడా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలోనే అత్యధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలకు 275 చొప్పున వెంటిలేటర్లు పంపించినట్లు కేంద్రం తెలిపింది. ఇతర ప్రభావిత రాష్ట్రాలు గుజరాత్‌కు 175, బిహార్‌కు 100, కర్ణాటకకు 90 మరియు రాజస్థాన్‌కు 75 చొప్పున వెంటిలేటర్లు పంపినట్లు వెల్లడించింది. ('50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి') అంతేకాక వలస కూలీల సంక్షేమం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిధి వలస కూలీలకు వసతి, ఆహారం, వైద్య చికిత్స, రవాణా ఏర్పాట్ల కోసం ఉపయోగించాలని సూచించింది. దీనిలో అత్యధిక మొత్తాన్ని మహారాష్ట్రకు రూ. 181 కోట్లు, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌కు రూ. 103 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత తమిళనాడుకు రూ. 83 కోట్లు, గుజరాత్‌కు రూ. 66 కోట్లు, ఢిల్లీకి రూ. 55 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 53 కోట్లు, బిహార్‌కు రూ. 51 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 50 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 50 కోట్లు, కర్ణాటకకు రూ. 34 కోట్లు కేటాయించింది. (భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు) కరోనా వైరస్ కట్టడి కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వివిధ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. -
కరోనా వేళ కొత్త జంట ఔదార్యం
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ సమయంలో నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలందుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా తమ వివాహ తంతు పూర్తి చేయడంతో పాటు కరోనా రోగులకు సహాయపడేలా వినూత్న నిర్ణయం తీసుకుంది ఈ కొత్త జంట. కోవిడ్-19 సంరక్షణ కేంద్రానికి 50 బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర వస్తువులను దానం చేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో స్థానికంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, కమ్యూనిటీ కిచెన్ ద్వారా బాధితులను ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత పట్టణాలకు వెళ్లే వలస కార్మికులకు కూడా సాయపడ్డారట. వివరాలను పరిశీలిస్తే..వాసాయిలోని నందాఖల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) చాలా నిరాడంబరగా పెళ్లి చేసుకున్నారు. కేవలం 22 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. అనంతరం సత్పాలా గ్రామంలో కొవిడ్-19 ఆస్పత్రికి అవసరమయ్యే 50 బెడ్లను, ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇచ్చి తమ ఔదారాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా దిండ్లు, బెడ్షీట్లు, కవర్లు తదితర వస్తువులను కూడా విరాళంగా ఇచ్చారు. వివాహ దుస్తుల్లోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. (కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే) మహమ్మారి కారణంగా చాలామంది మరణిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో, సుమారు 90 మంది మరణించారు.1,500 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నామని లోబో చెప్పారు. ఒక సాధారణ క్రైస్తవ వివాహానికి సుమారు 2వేల మంది అతిథులు హాజరవుతారు. వైన్, మంచి ఆహారం అన్నీ కలిపి భారీగానే ఖర్చవుతుంది. అందుకే భిన్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో సహాయపడటం ద్వారా తమ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనతో మార్చిలో స్థానిక ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్‌ను సంప్రదించి, దీనికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాస్ షిండే ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. మరోవైపు సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచారంటూ ఎరిక్, మెర్లిన్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఠాకూర్ ఈ జంట చేసిన గొప్ప పనికి అభినందనలు తెలిపారు. వాసాయి-విరార్ నివాసితులు సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారనీ, రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. -
భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు
న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్‌కు సహాయపడటానికి అమెరికా ప్రభుత్వం మంగళవారం దాదాపు 1.2 మిలియన్ డాలర్ల విలువైన 100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది. భారతదేశం యొక్క అత్యవసర అవసరాలకు అనుగుణంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సామాగ్రిని అందించారని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యాయని.. కరోనావైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేయడంలో ఇవి భారతదేశానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రకటించింది. అమెరికా భారతదేశానికి అందించాలని భావిస్తున్న 200 వెంటలేటర్లలో భాగమైన వీటిని యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఐఐడి) ద్వారా విరాళంగా ఇచ్చింది. (ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన) యూఎస్ఐఐడి.. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు ఇరు దేశాల్లోని ఇతర వాటాదారులతో కలిసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వెంటిలేటర్ల పంపిణీ, రవాణా, ప్లేస్మెంట్లో సహాయపడటానికి కృషి చేస్తోంది. భారతదేశానికి వెంటిలేటర్ల వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అపార ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భాగస్వామ్యం, సహకారం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలుగుతాము’ అని తెలిపారు. అంతేకాక అమెరికా ప్రజల ఔదార్యం, ఆ దేశ ప్రైవేట్ పరిశ్రమ ఆవిష్కరణల ద్వారా సాధ్యమైన వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా ఇవ్వడానికి అమెరికా సంతోషిస్తుంది అన్నారు. (చౌకైన వెంటిలేటర్) వెంటిలేటర్లను దానం చేసే అంశం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట మే 16న ట్వీట్ ద్వారా ప్రకటించారు. కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఇరువర్గాలు కూడా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ ఫోన్ కాల్ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. -
‘క్లోరోక్విన్’కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
లండన్: కోవిడ్-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతినిచ్చింది. గతంలో ఈ క్లినికల్ ట్రయల్స్‌ను డబ్ల్యూహెచ్ఓ అనుమతించలేదు. ఈ ఔషధానికి సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారని, ఆ తరువాతే క్లినికల్ ట్రయల్స్‌ను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని బుధవారం డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియెసస్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ అనుమతినివ్వడం అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కోసం ఎన్రోల్ అయి ఉన్న రోగులకు డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరొక్విన్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వవచ్చు. (ఏడాది చివరిలో వ్యాక్సిన్: పరిశోధకులు) వారంలో భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు వాషింగ్టన్: అమెరికా విరాళంగా ఇస్తానని ప్రకటించిన వెంటిలేటర్లలో 100 వెంటిలేటర్లను వచ్చేవారం భారత్‌కి పంపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీకి చెప్పారు. జీ–7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకావాలంటూ మోదీకి ట్రంప్ ఆహ్వనం పలికారు. గతహామీ ప్రకారం తొలిదశలో 100 వెంటిలేటర్లను భారత్‌కు పంపుతున్నామని ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో జీ7 సమావేశాల ప్రణాళిక గురించీ, కోవిడ్ సంక్షోభంతో సహా అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనల విషయాన్ని ట్రంప్‌తో మోదీ ప్రస్తావించినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇండోచైనా బోర్డర్ సమస్యపైనా చర్చించారు. (‘2 మీటర్ల భౌతిక దూరం తప్పనిసరి’) -
అమెరికా వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19పై సమిష్టి పోరుకు పరస్పర సహకారం అందించే దిశగా భారత్‌కు 200 వెంటిలేటర్లను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. తొలి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో భారత్‌కు చేరుకుంటాయని అమెరికన్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కంటికి కనిపించని కరోనా శత్రువుతో పోరాటంలో భారత్‌కు సహకరించేందుకు అమెరికా వెంటిలేటర్లను పంపిస్తుందని గత వారం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌కు పంపే వెంటిలేటర్లు విరాళంగా పంపుతామని దీనిపై ఎలాంటి మొత్తం వసూలు చేయబోమని యూఎస్ఎయిడ్ తాత్కిలిక డైరెక్టర్ రమొన హంజోయ్ స్పష్టం చేశారు. అమెరికా, అమెరికన్ల తరపున భారత్ సహా పలు దేశాలకు యూఎస్ఎయిడ్ వెంటిలేటర్లు, మందులను ఉదారంగా సరఫరా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ వెంటిలేటర్ల రవాణా, డెలివరీలకు సంబంధించి తాము భారత వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్‌క్రాస్ సొసైటీలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అవసరమైనవారికి వైద్య సేవలు అందించే క్రమంలో భారత్‌కు తోడ్పాటును అందించేందుకు వెంటిలేటర్లను విరాళంగా పంపుతున్నామని అన్నారు. చదవండి : 3000 మంది ఉబర్ ఉద్యోగులపై వేటు -
ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని వెల్లడించారు. భారత ప్రధనమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చిన ట్రంప్, భారతదేశంలోని తమ స్నేహితులకు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తుందని ప్రకటించడం గర్వంగా ఉందని శుక్రవారం ట్వీట్ చేశారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయనీ , కరోనా సంక్షోభ సమయంలో మోదీకి తమ మద్దతు వుంటుందని ప్రకటించారు. ఇరువురం కలిసి అదృశ్య శత్రువు కరోనాను ఓడిస్తామని పేర్కొన్నారు. అలాగే కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరిస్తున్న భారతీయ-అమెరికన్లను "గొప్ప" శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలకు మాజీ టీకాల హెడ్‌ను గ్లాక్సో స్మిత్‌క్లైన్ నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే) విలేకరుల సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మాట్లాడుతూ, భారతదేశం కొంతకాలంగా తమ గొప్ప భాగస్వామిగా ఉందనీ, వెంటిలేటర్లను పొందే అనేక దేశాలలో భారతదేశం కూడా ఒకటి ఉంటుందని ఆమె అన్నారు. కాగా దేశంలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం కేసుల సంఖ్య 85,940గా వుంది. తద్వారా చైనాను అధిగమించిన సంగతి తెలిసిందే. (గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్) చదవండి : వారికి భారీ ఊరట : వేతనాల పెంపు భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం -
కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైప్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్(రక్తంలో ఆక్సిజన్ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగించేందుకు సమాయత్తం చేస్తున్నారు. (కరోనాపై పోరు; మరో మైలురాయి) గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది. ఇందుకుగాను రూ.3.84 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్ గమ్ షూ, యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్ పంపిణీ చేయనుంది. ఒక్కొక్క రక్షణ కిట్ కోసం గరిష్టంగా రూ. 3 వేల చొప్పున ఖర్చు చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. (వీరంతా సచివాలయానికి రావాల్సిందే) -
అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్
సాక్షి, చెన్నై : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది, శరవేగంగా విస్తరిస్తూ వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు రోగులకు అందిస్తున్న చికిత్స లో కీలకమైన వెంటిలేటర్ల తీవ్ర కొరత మరింత ఆందోళన రేపుతోంది. ఈ సమయంలో అతితక్కువ ఖరీదుకే తయారు చేస్తామని ఒక స్టార్టప్ సంస్థ చెబుతోంది. అంతేకాదు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి వుందని చెబుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి-స్టార్టప్ జేకే దజ్తా సిస్టమ్స్ దీన్నిఅభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ వెంటిలేటర్ ప్రాజెక్ట్ ఆధారంగా, రీ-ఇంజనీరింగ్ డిజైన్‌తో తాము ఈ వెంటిలేటర్‌ను తయారుచేసినట్లు జేకే దజ్తా సిస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 22న ప్రాజెక్టును ప్రారంభించిన తాము కేవలం నాలుగు రోజుల్లోనే ఒక నమూనాతో ముందుకు వచ్చామని పేర్కొంది. స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రి అనుమతితో పాజిటివ్ ప్రెజర్ బ్రీతింగ్ వెంటిలేటర్ (ఐపీపీవీ) ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉందని చెప్పారు. తాము రూపొందించిన ఈ కొత్త పరికరం దేశవిదేశాల్లో వెంటిలేటర్లకున్న భారీ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లతో, కొత్తగా రీడిజైన్ చేసిన వెంటిలేటర్ల నమూనాను కేవలం రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని త్వరలోనే ఇక్కడి ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రిలో పరీక్షించనున్నామని చెప్పారు. రాతినం కాలేజీకి చెందిన బయో మెడికల్, కంప్యూటర్ సైన్స్ విభాగం సహకారంతో కార్తీక్ ఎస్, గౌతమ్, సంతకుమార్ బృందం ఈ వెంటిలేటర్ రూపకర్తలు. టైడల్ వాల్యూమ్, నిమిషంలో తీసుకునే శ్వాస రేటు, తదితర అన్ని వివరాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుందన్నారు. దీంతోపాటు రోగికి అందుతున్న ఆక్సిజన్ స్థాయిలను కూడా పర్యవేక్షించేలా మెరుగుపర్చినట్టు తెలిపారు. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో తయారు చేసిన ఈ వెంటిలేటర్ చాలా మంది రోగులకు సహాయం చేస్తుందని ఆశాభావం ఈ బృందం వ్యక్తం చేసింది. పరీక్షల అనంతరం అధిక సంఖ్యలో వాణిజ్య ఉత్పత్తి కోసం ప్రభుత్వ లైసెన్స్ తీసుకుంటాని తెలిపింది. -
‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’
సాక్షి, అమరావతి : దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేరట్లు తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు వారకు రాష్ట్రంలో రోజులు 3 నుంచి 4 వేల పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు( బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయన్నారు. టీబీ మెషిన్లకు అమర్చుకునేలా కిట్లను తయారు చేస్తున్నామని.. దీనివల్ల త్వరగా టెస్టింగ్ కిట్లను అమర్చుకోవచ్చని వెల్లడించారు. (కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష) మొట్టమొదటి ఇండియన్ మేడ్ వెంటిలేటర్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్ జోన్‌కు నిధులిచ్చి సీఎం అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ముందు చూపు వల్ల ఈ రోజు కిట్లు తయారు చేయగలిగామని, సీఎం జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (యూట్యూబ్ ఛానల్ ఆదాయమంతా దానికే: రకుల్ ) -
రూ.1.90 లక్షలకే వెంటిలేటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలున్న వారికి, పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 1 నాటికి 2 వైరాలజీ ల్యాబొరేటరీలు మాత్రమే ఉండగా, ఇప్పుడా సంఖ్యను 7కు పెంచారు. మన రాష్ట్రంలో 400 వెంటిలేటర్లు ఉండగా, కరోనా విపత్తు వచ్చాక మరో 100 వెంటిలేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటిలేటర్ల సంఖ్యను పెంచడానికి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. అతి తక్కువ ధరకే వెంటిలేటర్లను కొనుగోలు చేసి వైద్యమందించేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ డిజైన్ చేసిన వెంటిలేటర్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయోగాత్మకంగా వైద్యులు పరిశీలిస్తున్నారు. ► ఎయిమ్స్ రూపొందించిన వెంటిలేటర్ ధర రూ. 1.90 లక్షలు ► సాధారణంగా వెంటిలేటర్ ధర రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఉంటుంది ► తాము రూపొందించిన వెంటిలేటర్ ఉత్పత్తి బాధ్యతలు ఓ కంపెనీకి ఎయిమ్స్ అప్పగించింది ► విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంటుకు ఈ వెంటిలేటర్‌ను అమర్చి పరిశీలించారు ► పనితీరు మెరుగ్గా ఉందని వైద్యులు భావిస్తే కనీసం 200 వెంటిలేటర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రణాళిక. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
నిమ్స్‌కు విరాళమిచ్చిన మేఘా
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందే రోగులకు అవసరమైన వెంటిలేటర్ల ఏర్పాటుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్‌కు రాసిన లేఖతో పాటు, రూ. 41.95 లక్షల చెక్‌ను ఆదివారం అందజేశారు. "దేశ పురోగతిలో భాగస్వామి కావాలన్న మా నినాదంతో, భారతదేశం విలువైన వనరులను, దాని మానవశక్తిని కబళించే కోవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. ఈ విపత్తుతో పోరాడటానికి మీ పక్షాన నిలబడటానికి, మీకు మద్దతు ఇవ్వడానికి మేము ముందుంటాము. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర చికిత్స పొందే రోగులకు ఎంతో అవసరమైన వెంటిలేటర్లను సరఫరా చేస్తున్నాము. మీ రవాణా అవసరాలను తీర్చడానికి రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాము. భువిపై దేవతలైన మీకు సేవ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. రోగుల సేవకు మీకు ఏదైనా అత్యవసరం అయినపుడు సహకరించేందుకు తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అన్నది ఆ లేఖ సారాంశం. "దేశం మొత్తం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన కోవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో, దేశం మొత్తం వైద్య సేవల కోసం ఎదురుచూస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు తమ ప్రాణాలను, సంబంధాలను పణంగా పెడుతున్నారు. 'జనతా కర్ఫ్యూ'లో దేశం వారి సేవలను కొనియాడింది. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారి ధైర్యం ఎప్పుడూ తగ్గకపోవడం అనిర్వచనీయం" అని నిమ్స్ డైరెక్టర్ కు రాసిన లేఖలో మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతేకాక మేఘా సంస్థ కరోనా వ్యాప్తి నిరోధించడానికై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.5 కోట్ల చెక్ అందించగా, కర్ణాటకకు రూ. రెండు కోట్లు, ఒడిశాలకు కోటి చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే. -
వెంటిలేటర్ల తయారీలోకి మారుతీ!
న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా... కరోనావైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్‌ల తయారీ చేపట్టనుంది. భారత ప్రభుత్వం కోరిక మేరకు వెంటిలేటర్స్, మాస్క్‌లు, పీపీఈలను తయారు చేసేందుకు అగ్వా హెల్త్‌కేర్ కంపెనీతో కలిసి పనిచేస్తామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని లకి‡్ష్యస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. మారుతీ తయారు చేసే వెంటిలేటర్స్‌కు తగిన టెక్నాలజీని అగ్వాహెల్త్ కేర్ అందించనుంది. ఈ వెంటిలేటర్స్ తయారీకి కావాల్సిన నగదు, ప్రభుత్వపరమైన అనుమతులన్నింటిని మారుతీ సుజుకీ భరించి అగ్వా హెల్త్‌కేర్‌కు ఉచితంగా అందించనుంది. మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి హరియాణ, కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనుంది కూడా. ఇంకా భారత్ సీట్స్ లిమిటెడ్‌తో కలిసి వైరస్ నుంచి రక్షణ కల్పించే క్లాత్‌ను తయారు చేయనుంది. -
కరోనా కట్టడి : పోర్టబుల్ వెంటిలేటర్లు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందుతుండటంతో ప్రతిష్టాత్మక సంస్థ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఐఐటీ కాన్పూర్ అతితక్కువ ధరకే లభ్యమయ్యే పోర్టబుల్ వెంటిలేటర్లను అభివృద్ధి చేస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం లభ్యమయ్యే ఇన్వేజివ్ వెంటిలేటర్ల ధర ఒక్కోటి రూ 4 లక్షలు కాగా, తాము అభివృద్ధి చేసే వెంటిలేటర్ రూ 70,000కే అందుబాటులో ఉంటుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు వెల్లడించారు. తాము తయారుచేసే వెంటిలేటర్లలో విడిభాగాలన్నీ భారత్ నుంచే లభ్యమవుతాయని వారు చెప్పారు. ఈ పోర్టబుల్ వెంటిలేటర్ ప్రోటోటైప్‌ను ఐఐటీ కాన్పూర్ ఇంక్యుబేటర్‌లో నిఖిల్ కురూలే, హర్షిత్ రాధోర్లకు చెందిన స్టార్టప్ నొక్కా రోబోటిక్స్ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రొటోటైప్‌ను అత్యున్నత వైద్య నిపుణులతో కూడిన కమిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే నెలలో దాదాపు 1000 పోర్టబుల్ వెంటిలేటర్లను ఈ స్టార్టప్ సిద్ధం చేయనుంది. మొబైల్ ఫోన్‌కు శాశ్వతంగా కనెక్ట్ చేయబడి ఉండే ఈ వెంటిలేటర్‌ను ఫోన్ ద్వారానే నియంత్రిస్తూ కీలక సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చని కాన్పూర్ ఐఐటీ బృందం వెల్లడించింది. అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్‌ను దీనికి అటాచ్ చేసే వెసులుబాటు ఉందని తెలిపింది. చదవండి : కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి! -
కరోనా: త్వరలోనే అధునాతన వెంటిలేటర్లు
సాక్షి, ముంబై: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ని అడ్డుకునేందుకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలతో అనేక కార్పొరేట్ సంస్థలు తమ వంతుగా ముందుకు వస్తున్నాయి. దీనికోసం వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నాణ్యమైన వెంటిలేటర్ల తయారీని చేపట్టింది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన సంస్థ త్వరలోనే వెంటిలేటర్లను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని సంస్థ ఎండీ పవన్ గోయంకా గురువారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. (కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి: డబ్ల్యూహెచ్ఓ) As @GoenkaPk tweeted, we are simultaneously working with an indigenous maker of ICU ventilators. These are sophisticated machines costing between 5 to 10 lakhs. This device is an interim lifesaver & the team estimates it will cost below ₹7,500 https://t.co/3rz1FBkPF0 — anand mahindra (@anandmahindra) March 26, 2020 వెంటిలేటర్ల తయారీకి సంబంధించి రెండు ప్రభుత్వ రంగ విభాగాల భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న హై-స్పెక్ తయారీదారుతో కలిసి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. డిజైన్‌ను, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా ఇప్పటికే ఉన్న తయారీ సంస్థలతో చర్చిస్తున్నామనీ.. ఇందుకు తమ ఇంజనీరింగ్ బృందం కృషి చేస్తోందన్నారు. మరోవైపు బాగ్ వాల్వ్ మాస్క్ లేదా అంబు బ్యాగ్ (వెంటిలేటర్ ఆటోమేటెడ్ వెర్షన్) తయారీపై దృష్టిపెట్టాం. మరో మూడు రోజుల్లో దీని డిజైన్ సిద్ధమవుతుందని ఆశిస్తున్నాం. ఈ డిజైన్‌కు ఆమోదం లభించిన తయారీ అందరికీ అందుబాటులో ఉంటుందని పవన్ గోయంకా ట్వీట్ చేశారు. Ventilator 3: at other end we are working on an automated version of the Bag Valve Mask ventilator (commonly known as Ambu bag). We hope to have a Proto ready in 3 days for approval. Once proven this design will be made available to all for manufacturing. @PMOIndia @MahindraRise — Pawan K Goenka (@GoenkaPk) March 26, 2020 కాగా భయంకరమైన కరోనాను అడ్డుకునేందుకు ఇప్పటికే దేశంలో 21 రోజుల లాక్ డౌన్‌ను కేంద్రం ప్రకటించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. విమాన ప్రయాణం సహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా స్థంభించిపోయాయి. (5లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు)