vijyaramanarao
-
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో రైతుదీక్ష టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, ఎక్స్‌గ్రేషియా విషయంలో జిల్లాకో రకమైన నీతి పాటిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 339 మంది ఉన్నారని, అయితే 76 మందే చనిపోయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందన్నారు. కేవలం 15 మందికి రూ.1.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారని తెలిపారు. మెదక్ జిల్లాలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.6లక్షలు ఇచ్చారని అన్నారు. మెదక్‌లో మాత్రమే పూర్తిస్థాయిలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, మిగతా ప్రాంత రైతు కుటుంబాలను విస్మరించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, ఎక్స్‌గ్రేషియా, రుణాల మంజూరు తదితర సమస్యలపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుల వద్ద చేపట్టే రైతు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు తాజొద్దీన్, గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, పుట్ట నరేందర్, దామెర సత్యం, చెల్లోజి రాజు, జాడి బాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్, దూలం రాధిక, తీట్ల ఈశ్వరి, మాదవి, ఇందు, వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ అధ్యక్షుడిగా నియమితులైన తాజొద్దీన్‌ను పార్టీ నాయకులు సన్మానించారు. -
మొక్కలు ధ్వంసం చేస్తే హరితమిత్ర అవార్డులా..?
పెద్దపల్లి ఎమ్మెల్యేకిచ్చిన అవార్డు వెనక్కి తీసుకోవాలి టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్: నాటిన మొక్కలను తొలగించి హరితహారం కార్యక్రమానికి తూట్లు పొడిచిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి అందించిన హరితమిత్ర అవార్డును వెనక్కి తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఆర్వోకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2015లో సీఎం కేసీఆర్ పెద్దపల్లిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మొక్క నాటడంతోపాటు 4వేల మొక్కలను నాటినట్లు గుర్తుచేశారు. నగరపంచాయితీ చైర్మన్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే కలిసి మున్సిపల్ నుంచి రూ.2.5 లక్షలు వెచ్చించారన్నారు. హరితహారం కింద ఇంటింటికి పండ్ల మొక్కలు నాటేందుకు కోటి రూపాయలు తన సొంత డబ్బులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే నమ్మించారని ఆరోపించారు. దీని పేరుతో కాంట్రాక్టర్లు, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్నారు. ఐటీఐ ఆవరణలో నాటిన మొక్కలన్నింటిని తమ ట్రినిటీ విద్యాసంస్థలకు ఆట స్థలంగా పనికి వస్తుందని చదును చేశారని తెలిపారు. తొలగించిన మొక్కల్లో ముఖ్యమంత్రి నాటిన మొక్క ఉందని గుర్తుచేశారు. హరితహారానికి తూట్లు పొడిచిన వారికి హరితమిత్ర అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మొక్కలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. నాయకులు కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, పుట్ట నరేందర్, దామెర సత్యం, అనసూర్యనాయక్, సదానందం, గట్టుయాదవ్, అబ్బయ్యగౌడ్, సుధాకర్‌రెడ్డి, సంపత్, కమలాకర్, తీగుట్ల రమేశ్, గాజె రమేశ్, ఈశ్వరి పాల్గొన్నారు.