Vinay Raj
-
యువతకు ఆయన మహిమలు తెలియాలనేదే మా సంకల్పం
నేటి యువతకు శ్రీ మహావిష్ణు మహత్యం తెలియజేయాలనే సంకల్పంతో రూపొందించిన చిత్రం ‘శ్రీ రంగనాయక’. దుండిగల్ వినయ్ రాజ్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించారు. గోవింద రాజ్ విష్ణు ఫిలింస్ బ్యానర్‌పై రామావత్ మంగమ్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడంతో పాటు డ్రమ్స్ రాము సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. (చదవండి: భారీ యాక్షన్ ప్లాన్‌తో 'ప్రాజెక్ట్ కె'..!) ‘‘శ్రీ రంగనాయక’ చిత్రంలో శ్రీ మహావిష్ణు పాత్రలో నటించడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు దుండిగల్ వినయ్ రాజ్. ‘‘మా చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమావత్ మంగమ్మ. ఈ వేడుకలో ఏవీ కాలేజ్ ప్రిన్సిపల్ సీహెచ్ రాజలింగం, నటులు కుప్పిలి శ్రీనివాస్, గబ్బర్‌సింగ్ సాయి పాల్గొన్నారు. -
ప్రతి క్షణం ఉత్కంఠ!
సస్పెన్స్, హారర్, కామెడీ నేపథ్యంలో వినయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాయ చిత్రం’. వినయ్‌రాజ్, రుక్షా జంటగా జి. వెంకటేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ -‘‘ప్రతి సన్నివేశం ఉత్కంఠగా ఉంటుంది. 20 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మిస్ ఇండియా గుజరాతీ వైశాలి పటేల్ చేసిన ప్రత్యేక పాత్ర ఓ హైలైట్. ఈ చిత్రం పోస్టర్స్ చూసి, హిందీ అనువాద హక్కులను సూపర్ గుడ్ బాలాజీ, మంజునాథ్ తీసుకున్నారు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ భాషలవారు కూడా సంప్రదిస్త్తున్నారు. నవంబర్ 15న పాటలను, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.