నేటి యువతకు శ్రీ మహావిష్ణు మహత్యం తెలియజేయాలనే సంకల్పంతో రూపొందించిన చిత్రం ‘శ్రీ రంగనాయక’. దుండిగల్ వినయ్ రాజ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించారు. గోవింద రాజ్ విష్ణు ఫిలింస్ బ్యానర్‌పై రామావత్ మంగమ్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడంతో పాటు డ్రమ్స్ రాము సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు.
(చదవండి: భారీ యాక్షన్ ప్లాన్‌తో 'ప్రాజెక్ట్ కె'..!)
‘‘శ్రీ రంగనాయక’ చిత్రంలో శ్రీ మహావిష్ణు పాత్రలో నటించడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు దుండిగల్ వినయ్ రాజ్. ‘‘మా చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమావత్ మంగమ్మ. ఈ వేడుకలో ఏవీ కాలేజ్ ప్రిన్సిపల్ సీహెచ్ రాజలింగం, నటులు కుప్పిలి శ్రీనివాస్, గబ్బర్‌సింగ్ సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment