విశాఖ టు ఢిల్లీ, ముంబైకి కొత్త విమానాలు
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ-ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 9.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
ఇక, విశాఖ-ముంబై విమాన సర్వీసు ముంబై నుంచి ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 9.25 గంటలకు ప్రయాణమై.. 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది.