Voditela Satish kumar
-
హుస్నాబాద్: బీఆర్ఎస్కు అవే మైనస్సా?
2014 నుండి హుస్నాబాద్ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుండి వోడితల సతీష్ కుమార్ గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి, రావు, కాపు, ముదిరాజ్, గిరిజన సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. కులాల వారిగా ఓటర్ల శాతం ► బిసి: 60% ► ఎస్సీ: 15% ► ఎస్టీ: 10% ► ఇతరులు: 15% పార్టీల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు కాంగ్రెస్‌లో కూడా ఆశావాహులు లేరు బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు సీపీఐ కూడా పోటీకి ఆసక్తి చూపుతుంది ఆశావహులు బీఆర్ఎస్ నుంచి వోడితల సతీష్ కుమార్ కాంగ్రెస్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బీజేపీ నుండి ఇద్దరు (బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు) సీపీఐ నుండి చాడ వెంకటరెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు.. గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించలేకపోవటం IOC భవనంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా హుస్నాబాద్‌లో మినీ స్టేడియం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయలేకపోవడం గ్రామాల పరిధిలో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవటం.. అధికార పార్టీ అభ్యర్థి, అనుకూలతలు గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చటం వోడితల సతీష్ కుమార్.. సౌమ్యుడు, మృదుస్వభావ వ్యక్తిత్వం కలిగిన వారవటం. ప్రతికూలతలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో సమయపాలన పాటించడనే విమర్శ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రారంభించకపోవటం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం.. ప్రతికూలతలు.. అధికారిక పార్టీని గ్రామ స్థాయిలో ఎదురుకొలేకపోవటం. -
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు ఝలక్
సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు వొడితెల సతీశ్‌కుమార్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ ఆయనను అడ్డుకున్నారు. ‘ఏమీ చేయని ఎమ్మెల్యే మా గ్రామంలోకి రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. ఈ ఆందోళనలో సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నేతలు వీరికి మద్దతు పలికారు. టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం.. తమ నాయకుడిని అడ్డుకోవంతో సహించలేని టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. మహిళలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న చిగురుమామిడి సురేందర్ సీఐ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా సరే సతీశ్‌ను గ్రామంలోకి రానివ్వమంటూ నినదించారు. 15 ఏళ్లుగా మట్టిరోడ్లతో ఇబ్బంది పడుతున్నామని, తాగడానికి మంచి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా వొడితెలకు ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. తాజాగా ప్రచారంలో భాగంగా తనకు అడ్డుపడిన వారిపై సతీశ్ బూటు కాలితో దాడి చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. (ప్రచారంలో రెచ్చిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే) -
ప్రచారంలో రెచ్చిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హుస్నాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు వొడితెల సతీశ్ కుమార్ రెచ్చిపోయారు. తనను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బూటు కాలితో దాడి చేశారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకుడు వొడితెల సతీశ్ కుమార్ బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తమ నిరసన తెలియజేసేందుకు రోడ్డుపై బైఠాయించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఈ ధర్నాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఉండటంతో.. ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితెల వారిపైకి దూసుకెళ్లారు. అక్కడున్న వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యేకు జతచేరి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాటతో సుమారు 20 నిమిషాల పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.