రేపు ఒంటిమిట్ట రథోత్సవానికి వైఎస్ జగన్
ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా) : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం రథోత్సవం కార్యక్రమం జరగనుంది. స్వామివారి రథోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
కోదండరామస్వామివారి రథోత్సవం కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.