ఓటర్లు మాయం!
కనిపించని ఓటర్ల చిరునామాలు
వాస్తవ లెక్కలపై అధికారుల ఆరా
వివరాలు లేని వారికి నోటీసులు
15 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని సూచన
లేదంటే జాబితా నుంచి తొలగింపు
సిటీబ్యూరో: గ్రేటర్‌లోని ఓటర్ల సంఖ్యపై అయోమయం నెలకొంది. కాగితాలపై లెక్కలకు... వాస్తవానికి మధ్య భారీ తేడా ఉంటోంది. దీంతో అధికారులు అసలు లెక్క తేల్చే పనిలో పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 83.85 ల క్షలు. వారిలో 40.03 లక్షల మంది ప్రస్తుతం ‘మాయ’మయ్యారు. వారి పేర్లు జాబితాలో ఉన్నాయి. కానీ ఆధార్‌తో ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన అధికారులకు చాలామంది వివరాలు దొరకలేదు. తమ చిరునామాల్లో లేకపోవడం.. ఇళ్లకు తాళం వేసి ఉండటం.. రెండు చోట్ల పేర్లు కలిగి ఉండటం.. మరణించడం వంటి కారణాలతో వీరి వివరాలు లభించలేదు.
బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రేషన్ లబ్ధిదారులపై సర్కారు నిర్లక్ష్యంతో గుదిబండ పడింది. సకాలంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఐదు నెలలుగా పేద కుటుంబాలు మీ సేవ లేదా ఆన్లైన్ కేంద్రానికి వెళ్లి రూ.10 సమర్పించు కొని డేటా స్లిప్ తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మహానగరం పరిధిలో సుమారు 20.29 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా తిప్పలు తప్పడం లేదు. దీంతో నిరుపేద కుటుంబాలపై ఇప్పటి వరకు సుమారు రూ.13.50 కోట్ల మేర అదనపు భారం పడడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. కొత్త కార్డులు ఆగస్టు తర్వాతే జారీ అయ్యే అవకాశాలుండటంతో అప్పటి వరకు ఇదే పరిస్థితి అని పౌరసరఫరా శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రతి నెలా కొత్త స్లిప్‌లు..
తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్‌కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డుల పేరిటకొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి కూపన్లు ఇప్పటి వరకు జారీ చేయలేదు. కేవలం ఆన్లైన్ వెబ్సైట్లో మంజూరైన కార్డుల వివరాలను పొందు పర్చి చేతులు దులుపుకోవడంతో నిరుపేదలపై భార ం తప్పడం లేదు. ప్రతినెల ఆన్లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని సమర్పిస్తే తప్ప రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ప్రతినెల జారీ చేస్తున్న డైనమిక్ కీ రిజిస్ట్రర్‌లో లబ్ధిదారుల వివరాలు ఉంటున్న డీలర్లు మాత్రం డేటా స్లిప్ తప్పని సరిగా సమర్పించాల్సిందేనని పేర్కొంటున్నారు. దాని ఆధారంగానే రేషన్ సరుకులు అందజేస్తున్నారు.
ఆధార్ జిరాక్స్ తంటా..
కొత్తగా మంజూరైన కార్డు డేటా స్లిప్ తోపాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ జిరాక్స్‌లు సైతం రేషన్ సరుకులకు తప్పని సరిగా మారాయి. ప్రతినెల కుంటుంబ సభ్యులందరి ఆధార్ జిరాక్స్ అడుగుతుండటంతో అదనపు భారం తప్పడం లేదు. డైనమిక్ కీ రిజిస్ట్రర్‌లో ప్రతినెలా చేర్పులు, మార్పులు జరుగుతుండటంతో ఆధార్ తప్పని సరి అని డీలర్లు పేర్కొంటున్నారు. కొత్త కార్డులు జారీ అయ్యే వరకూ నిరుపేదల పై ఈ భారం తప్పేటట్లు లేదు. ఫలితంగా ఆన్లైన్ కేంద్రాలకు కాసుల పంట పండుతోంది.