పంట పశువుల పాలు
కేసముద్రం : ఆరుగాలం శ్రమించినా వరుణదేవుడు కరుణించలేదు. బావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. ఎంతో ఆశతో వేసిన పంట కళ్ల ముదే ఎండిపో యి పశువుల పాలైంది.
కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్కు చెందిన కముటం కృష్ణమూర్తి తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. కొంతమేరకు పంట పెరగగానే వర్షాలు వెనుకబాటు పట్టాయి. బావిలో కూడా నీళ్లు అడుగంటి పోవడంతో పంటకు నీరు కరువైంది. పంట ఎండిపోతుండడంతో తనకున్న పశువులకైనా మేతకు పనికి వస్తుందని భా వించిన రైతు గురువారం పశువులను ఇలా పంటచేనులోకి తోలాడు.