మిస్ యు సచిన్!
మొహాలీ: సచిన్ మ్యాచ్ ఆడినా...ఆడకున్నా మైదానంలో, అభిమానుల మనసుల్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంటాడు. శనివారం మూడో వన్డే సందర్భంగా పీసీఏ స్టేడియంలోనూ అదే జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొద్ది సేపు మైదానం పైన ఒక చిన్న సైజు విమానం చక్కర్లు కొట్టింది.
దానికి ‘వి విల్ మిస్ యు టెండూల్కర్’ అని రాసిన ఒక బ్యానర్ కట్టి ఉండటం ప్రత్యేకాకర్షణగా కనిపించింది. ఒక ఆభరణాల బ్రాండ్‌కు చెందిన సంస్థ విమానాన్ని అద్దెకు తీసుకొని ఈ తరహాలో తమ అభిమానం చాటుకుంది. మరో వైపు చాలా కాలం విరామం తర్వాత సొంత గడ్డపై ఆడిన యువరాజ్ సింగ్ తొలి బంతికే వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది.