wedding rumours
-
'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?
'జాతిరత్నాలు' అనగానే నవీన్ పొలిశెట్టి గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అని మరో మూవీ చేశాడు. దీంతో కూడా హిట్ కొట్టాడు. ఇదొచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి పెళ్లయిపోయిందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్)'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన నవీన్.. చాలారోజుల నుంచి అక్కడే ఉన్నాడు. మొన్నీమధ్య ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో చేతికి కట్టుతో కనిపించాడు. తన గాయం గురించి కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి, తనకేం పర్లేదని త్వరలో కోలుకుంటానని కూడా చెప్పాడు.అయితే అమెరికాలో నవీన్ ఓ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని, అందుకే చాలారోజుల నుంచి అక్కడే ఉండిపోయాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవీన్.. అలాంటిదే లేదని, తనకు పెళ్లి జరిగితే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పాడు. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
హీరో రామ్‌తో అనుపమ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు భలే ఇంట్రస్ట్.. వారు ఏయే సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్‌గా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలా అన్నింటినీ ఆరా తీస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి జీవితంలోకి తొంగి చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు గాసిప్‌రాయుళ్లు సెలబ్రిటీల గురించి లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తుంటారు. అందులో లేటెస్ట్ రూమర్ ఒకటి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోతో ప్రేమలో బ్యూటీ? బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారట! త్వరలోనే వీరు ఏడడుగులు వేయనున్నారట! ఈ మేరకు ఓ వార్త నెట్టింట కోడై కూస్తోంది. సాధారణంగా ఇలాంటి గాసిప్స్‌ను అనుపమ లైట్ తీసుకుంటుంది. అయితే ఈ రూమర్లు విని విసుగు పుట్టిన అనుపమ తల్లి సునీత సదరు పుకార్లపై స్పందించినట్లు తెలుస్తోంది. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో పిసరంత నిజం కూడా లేదని కొట్టిపారేసిందట! ఇది చూసిన ఫ్యాన్స్.. హమ్మయ్య, మా అనుపమ ఇంకా సింగిలే అంటూ ఎగిరి గంతేస్తున్నారు. సినిమాల సంగతి.. కాగా అనుపమ, రామ్.. రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో రవితేజ ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేస్తోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్.. బ్యూటీ రియాక్షన్ చూశారా? -
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!
ఈ మధ్య జానపద పాటలు సినిమాల్లో వాడటం ట్రెండ్ అయిపోయింది. అయితే ఎక్కడ జానపదం ఉంటే అక్కడ మంగ్లీ ఉండాల్సిందే! బతుకమ్మ, బోనాలు.. ఇలా పండగల పాటలే కాదు, జానపదాలు, సినిమా పాటలూ పాడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సింగర్ మంగ్లీ. అయితే మంగ్లీ త్వరలో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరో రెండు నెలల్లో ఆమె పెళ్లి పీటలెక్కనుందని, స్వయానా తన బావతోనే మనువాడనుందని సదరు వార్త సారాంశం. ఇప్పటికే తను సైన్ చేసిన ప్రాజెక్టులను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి పనుల్లో నిమగ్నం కానుందని జోరుగా ప్రచారం నడిచింది. తాజాగా ఈ రూమర్స్ విన్న మంగ్లీ ఘొల్లున నవ్వేసింది. ఏంటి? నాకు పెళ్లా? ఓరి భగవంతుడా.. నాక్కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా? అని సదరు వార్తలు కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. సోషల్ మీడియా తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటోంది. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ పుకారు సృష్టించినవాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా.. అంటూ సెటైర్లు వేసింది. చదవండి: హారర్ సిరీస్‌తో భయపెడతానంటున్న ఓంకార్ అన్నయ్య.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే? -
మా అమ్మానాన్న కూడా అడగలేదు!
‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న లైఫ్‌లో ఒక దశలో దాదాపు అందరికీ ఎదురవుతుంటుంది. సెలబ్రిటీలను అయితే ప్రతి ఇంటర్వ్యూలో, బయటికి వెళ్లినప్పుడు.. ఇలా తరచూ ఈ ప్రశ్న వెంటాడుతుంటుంది. ఇటీవల తమన్నాని ఓ అభిమాని, ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటారు? తమిళ అబ్బాయిలెవరైనా నచ్చారా?’’ అని అడిగితే.. ‘‘ఇప్పటివరకూ మా అమ్మానాన్న కూడా అడగలేదు’’ అంటూ ఈ బ్యూటీ కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు. ఇక తమిళ అబ్బాయిలు ఎవరైనా నచ్చారా? అనే ప్రశ్నని ఉద్దేశించి ‘‘ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం చాలా ఆనందంగా సాగుతోంది’’ అని పేర్కొన్నారామె. నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్నకు – ‘‘విమర్శలు, ప్రశంసలు.. రెండూ వస్తుంటాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అలా అన్నారా? అని ఆలోచిస్తాను. అయితే విమర్శ, ప్రశంస.. ఏదైనా వారి వ్యక్తిగత అభి్ర΄ాయమే. అందుకని పెద్దగా పట్టించుకోను’’ అన్నారు తమన్నా. -
Vishal-Lakshmi Menon: హీరోయిన్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడన్నది సదరు వార్త సారాంశం. తాజాగా ఈ రూమర్స్‌పై విశాల్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'సాధారణంగా పుకార్లు, అసత్య ప్రచారాలపై నేను స్పందించను. ఎందుకంటే అలాంటివాటిపై స్పందించి కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఈ సారి లక్ష్మీ మీనన్‌తో నా పెళ్లి జరగబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తనతో పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. మీరెలా చెప్తారు? ఈసారి నేను రియాక్ట్ అవ్వడానికి గల ఏకైక కారణం.. అమ్మాయి పేరు ప్రస్తావించడం! ఆమె నటి అయినప్పటికీ తను కూడా ఒక అమ్మాయే కదా! తన పేరుప్రతిష్టలకు భంగం కలిగిస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను? ఎప్పుడు చేసుకుంటాను అనేది మీరెలా చెప్తారు? నిజంగా నా జీవితంలో శుభఘడియలు ప్రవేశించినప్పుడు నేనే స్వయంగా అందరికీ అధికారికంగా వెల్లడిస్తాను' అని ట్వీట్ చేశాడు. దీంతో విశాల్- లక్ష్మీ మీనన్‌ల పెళ్లి ప్రచారం వుట్టిదేనని తేలిపోయింది. విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇకపోతే ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది కాకుండా ఆయన చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి స్వయంగా విశాలే డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు తనలోని నటుడినే చూపించిన విశాల్ ఇప్పుడు తనలోని దర్శకుడి కోణాన్ని కూడా బయటపెడుతున్నాడు. Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless. The reason behind my response is only… — Vishal (@VishalKOfficial) August 11, 2023 చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు.. ఎంతంటే? -
ముంబయిలో వాలిపోయిన లవ్ బర్డ్స్.. త్వరలోనే ఎంగేజ్మెంట్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట ఓ రెస్టారెంట్ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడగా.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అంతే కాకుండా మరో ఎంపీ సైతం వీరిద్దరి రిలేషన్‌ను నిజం చేస్తూ ట్వీట్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన పరిణీతి చోప్రా అభిమానులు సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. తాజాగా పరిణామాలతో ఈ లవ్ బర్డ్స్ అందరూ అనుకుంటున్నట్లుగానే డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి జంటగా కనిపిస్తున్నారు. మరోసారి పరిణీతి, రాఘవ్ చద్దా ఆదివారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కలిసి వెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట విమానాశ్రయంలో నవ్వుతూ కమెరాల కంటికి చిక్కారు. ఢీల్లీ నుంచి బయలు దేరి నేరుగా ముంబయిలో వాలిపోయారు. (ఇది చదవండి: ఆప్ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్) త్వరలోనే పరిణీతి-రాఘవ్ నిశ్చితార్థం? తాజా నివేదికల ప్రకారం పరిణీతి, రాఘవ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పరిణీతి, రాఘవ్ కుటుంబాలు ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు తేదీని కూడా ప్రకటించే అవకాశముంది. WATCH | Amid wedding buzz, #RaghavChadha and #ParineetiChopra got spotted at Mumbai airport today pic.twitter.com/gih5a79Yrw — Bollywood Buzz (@BollyTellyBuzz) April 2, 2023 -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే!
హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా, రైటర్‌గా కూడా శింబుకి గుర్తింపు ఉంది. మల్టీ టాలెంటెడ్‌గా హీరోగా తమిళ నాట విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న శింబు హీరోయిన్స్‌తో లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పట్లో నయనతార, హన్సికలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ శింబు పెళ్లంటూ వార్తలు రాగా వాటిలో నిజం లేదని తేలింది. ఈసారి మాత్రం శింబు పెళ్లి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు వధువుకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ తాజ బజ్ ప్రకారం.. కోటీశ్వరురాలైన శ్రీలంకన్ అమ్మాయితో శింబు త్వరలో ఏడడుగు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో శింబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయి ఓ మెడికల్ స్టూడెంట్ అని, శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని తెలుస్తోంది. ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయట. అయితే ఆ అమ్మాయి శింబుకు పెద్ద అభిమాని అని, ఇదే క్రమంలో ఓ సారి శింబును కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఎర్పడిందట, అది కాస్తా ప్రేమగా మారినట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకుంటున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ అయితే ఆయన తండ్రి డి. రాజేంద్రన్ శింబు పెళ్లిపై గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శింబు పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో ఆయన ఫ్యాన్స్ అంత ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శింబు నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. -
గతేడాది నవంబర్లోనే పెళ్లైపోయింది!: రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ముగిని తేలుతున్న సంగతి తెలిసిందే! ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అప్పుడప్పుడూ మీడియాకు సైతం చిక్కుతుంటారు. అయితే రకుల్ ప్రియుడితో పెళ్లికి రెడీ అయిందంటూ తరచూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం సర్వసాధారణమైపోయింది. రకుల్ సోదరుడు అమన్ సైతం వారి పెళ్లి వార్తలను ధృవీకరించాడని లేటెస్ట్గా ఓ రూమర్ మొదలైంది. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. 'నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దాని ప్రకారం నేను గతేడాది నవంబర్లోనే పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ మా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనేలేదు? ప్రస్తుతానికి మా బిజీలో మేమున్నాం. పని గురించి తప్ప మాకు వేరే ధ్యాస లేదు' అని క్లారిటీ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను గూగుల్‌లో ఫుడ్ గురించి సెర్చ్ చేస్తుంటా.. దేంట్లో ఎంత క్యాలరీస్ ఉంటాయనేది తెలుసుకుంటా. కేవలం ఫుడ్, క్యాలరీస్, ఆరోగ్యం గురించే శోధిస్తుంటాను. కానీ నాకు వంట మాత్రం రాదు. పరమ దరిద్రంగా ఎలా వండాలో మీక్కావాలంటే నేను నేర్పిస్తాను. అది అందరికీ రాదు' అని పేర్కొంది రకుల్. -
KL Rahul: అతియాతో పెళ్లి! జిగేల్మంటున్న రాహుల్ నివాసం
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహమాడబోతున్నాడు. వీరి పెళ్లికి సంబంధించి ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇరు కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. photo courtesy :KL Rahul/Instagram న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌కు రాహుల్ దూరం కావడం సహా.. ముంబైలో ఉన్న అతడి ఇంటిని అందంగా అలంకరించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్లష్ పాలి హిల్‌లోని సంధూ ప్యాలెస్ లైట్లతో వెలిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. photo courtesy :KL Rahul/Instagram జనవరి 23న రాహుల్- అతియా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు వర్గాల పెద్దలు నిశ్చయించారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అతియా తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌజ్‌లో ప్రివెడ్డింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో రాహుల్- అతియా పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. photo courtesy :KL Rahul/Instagram View this post on Instagram A post shared by @varindertchawla -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్!
హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్‌లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా జరుగుతుంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నట్లు టాక్. పెళ్లికొడుకు వ్యాపారవేత్త అని, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే కీర్తీ సురేష్ ఇంట మంగళ వాయిద్యాలు మోగుతాయన్నమాట. అయితే ఈ గాసిప్‌లపై కీర్తి సురేష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటి కీర్తీ సురేష్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. కేరీర్ మంచి స్వింగ్‌లో ఉండగా ఈ అమ్మడు పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదు కదా! -
పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్
తన పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ స్పందించింది. తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనిపై నిత్యా స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచి నా పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని’ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ కాగా నిత్యా మీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్ స్టార్ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నిన్నటి నుంచి పలు మలయాళ వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిత్యా మీనన్ వెబ్ సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల భీమ్లా నాయక్‌తో అలరించిన ఆమె తాజాగా మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు తాజాగా ఆమె నటించి మలయాళ చిత్రం 19(1)(a) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే దీని రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంలో హీరో ధనుష్‌తో నటించిన ‘చిరు చిత్రంబళం’ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఆమె మరో చిత్రం ‘ఆరం తిరుకల్పన’ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్?
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తన మల్టీ టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్యాపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదు. చదవండి: Actress Kalayani Divorce: ఆ భయంతోనే కల్యాణి విడాకులు అడిగింది..: సూర్య కిరణ్ హీరోయిన్ అంటే ఆ హీరోతో డేటింగ్ అని, ఈ నటుడితో సహాజీవనం వంటి వార్తలు వినిపించడం సర్వాసాధారణం. కానీ తనపై ఒక్క పుకారు కూడా రాకుండా ఇండస్ట్రీలో రాణించడమంటే అది కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందులో నిత్యా ఒకరని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా నిత్యా పెళ్లికి సంబంధించి రకరకాల పుకార్లు ప్రస్తుతం నెట్టిం చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో ఉన్న నిత్యా మీనన్ ప్రస్తుతం పెళ్లి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది చిత్ర పరిశ్రమలోని వ్యక్తే నని, అతడు ఓ స్టార్ యాక్టర్ అని వినికిడి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. సదరు హీరోకు, నిత్యాకు కొంతకాలంగా మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందంటూ మలయాళ వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కాగా ఇటీవల భీమ్లానాయక్ చిత్రంతో అలరించిన నిత్యా మీనన్ రీసెంట్గా ‘మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్ ప్రైం వీడియోస్‌లో జూలై 8న విడుదలై ఈ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది నిత్యా. -
లండన్‌లో సీక్రెట్‌గా హీరో పెళ్లి..!
ఈ మధ్య బాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్ హీరోగా, విలన్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్. తాజాగా ఇతడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గర్ల్‌ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో ఈ నెలలోనే ఏడగుడు వేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా కాగా గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం లండన్ వేకేషన్లో ఉంది. అక్కడే సీక్రెట్‌గా ఈ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాల వస్తుంటే.. ఇప్పటికే వారి వివాహం జరిగిపోయిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందేహాలకు త్వరలోనే విద్యుత్ చెక్ పెట్టనున్నాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కొద్ది రోజుల్లో తమ వివాహంపై స్వయంగా ప్రకటన ఇవ్వనున్నాడని సమాచారం. కాగా విద్యుత్ జమ్వాల్ కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్ శక్తి, ఉసరవెల్లి చిత్రాల్లో విలన్‌గా నటించాడు. View this post on Instagram A post shared by Nandita Mahtani (@nanditamahtani) చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. -
అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి
బాలీవుడ్ బ్యూటీ, నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటికే ఇరుకుంటుంబ సభ్యులు కలుసుకుని మాట్లాడుకున్నారని, పెళ్లి ముహుర్తం కూడా ఖారరైందంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ జంట ఫ్యాన్స్‌లో సందేహాలు నెలకొన్నాయి. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమార్స్‌పై అతియా తండ్రి సునీల్ శెట్టి స్పందించాడు. ఇటీవల రేడియో మిర్చికి ఇచ్చిన ఇంటర్య్వూలో కూతురు అతియా-రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చాడు. అతియా, రాహుల్ పెళ్లికి డేట్ ఫిక్సయిందని, కార్డ్స్ కూడా ప్రింట్ అవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయని, ఇందులో నిజమేంత అని సునీల్ శెట్టి ప్రశ్నంచగా.. అలాంటిది ఏం లేదని, ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదంటూ ఆయన రూమర్లకు చెక్ పెట్టాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న అతియా సోదరుడు అయాన్ శెట్టికి సైతం ఇదే ప్రశ్న ఎదురవగా.. ‘ఈ వార్తల్లో నిజం లేదు.. మా ఇంటిలో ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు జరగడం లేదు. ఏదైన ఉంటే మేం ముందుగా చెబుతాం కదా’ అన్నాడు. చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్ ఇక పెళ్లి డేట్‌పై రూమార్స్‌పై అడగ్గా.. అసలు పెళ్లే జరగడం లేదు.. ఇక డేట్ ఎలా చెప్పగలనంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉంటే గత మూడేళ్లుగా ప్రేమించుకున్నఅతియా, రాహుల్‌లు మరో మూడు నెలల్లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని ఈ జంజ సన్నిహితుల నుంచి సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని (ముంబై) సందర్శంచారని.. అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని అతియా సన్నిహితవర్గాలు పేర్కొన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి
Athiya Shetty Response on Her Marriage Rumours With KL Rahul: ప్రముఖ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఉండేందుకు ముంబైలో బ్రాండ్ న్యూ హోం కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌తో పెళ్లి వార్తలపై స్పందించింది హీరోయిన్ అతియా శెట్టి. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన అతియాకు రాహుల్‌తో డేటింగ్, పెళ్లి రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఇది విని ఆమె ఒక్కసారిగా నవ్వింది. చదవండి: డెలివరీ తర్వాత ఫస్ట్ ఫోటో షేర్ చేసిన కాజల్ అనంతరం ‘దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. ఈ రూమర్స్ విని విని విసిగిపోయా. ఇక ఈ వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ప్రజలకు ఎలా అనిపిస్తే అలా అనుకోవివ్వండి. వారికి నచ్చినట్టుగా వారు ఆలోచిస్తున్నారు’ అని బదులిచ్చింది. అలాగే రాహుల్‌తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. ‘నేను కొత్త ఇంటికి మారుతున్న విషయం వాస్తవమే. కానీ ఎవరితోనో కాదు. నా కుటుంబంతోనే. త్వరలోనే మా అమ్మ-నాన్న(మన శెట్టి-సునీల్ శెట్టి)తో పాటు నా సోదరుడుతో కలిసి ముంబై బాద్రాలోని కొత్త ఇంటికి మారబోతున్నా’ అని చెప్పుకొచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్ ఎక్కడంటే కాగా గత మూడేళ్లుగా కెఎల్ రాహుల్, అతియాలు సీక్రెట్ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్ చేశారు ఈ జంట. కెఎల్ రాహుల్ బర్త్‌డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే' అని అతియా పోస్ట్ షేర్ చేసింది. దీంతో త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల పింక్ విల్లా తన కథనంలో రాహుల్ అతియాలు ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్ రోడ్లో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, ఈ అపార్ట్మెంట్ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది అంటూ ప్రచురించింది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అఫిషియల్: అలియాకు ఫర్హా ఖాన్ విషెస్, బయటికొచ్చిన వీడియో చాట్
ప్రస్తుతం బాలీవుడ్లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్ల పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి ముహుర్తం, వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లిలో కాబోయే జంట ధరించే పెళ్లి పట్టలు, నగలు నుంచి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు అలియా కానీ, రణ్‌బీర్ కానీ స్పందించలేదు. దీనిపై ఇరు కుటుంబాలు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అలియా-రణ్‌బీర్ పెళ్లి వార్తలను అఫిషియల్ చేస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది. చదవండి: పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్! కారణం ఇదేనా? మహిళ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వీడియో కాల్లో అలియాతో మాట్లాడుతూ కనిపించారు. ఇందులో అలియా వెనకాలే రణ్‌బీర్ కూడా కనిపించాడు. ఓ రెస్టారెంట్లో విందుకు వెళ్లిన ఫరా ఖాన్, ఆమె స్నేహితులు అలియాకు శుభాకాంక్షలు తెలుపుతూ గట్టిగా అరిచారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. అయితే ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వచ్చే వార్తలు నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ వీడియో చూసిన ఈ జంట ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా అలియా-రణ్‌బీర్‌కు నెటిజన్లు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో ఈ జంట ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలియా-రణ్‌బీర్‌ల వెడ్డింగ్ తేదీ వాయిదా పడిందని ఆమె కజిన్ రాహుల్ స్పష్టం చేశాడు. రీసెంట్గా మీడియాలో మాట్లాడుతూ.. వెడ్డింగ్ ప్లాన్స్ బయటకు రావడం వల్లే పెళ్లి తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేసినట్లు అతడు చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by POP Diaries (@ipopdiaries) -
త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్ లవ్‌బర్డ్స్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి రిలేషన్‌ను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్య బాలీవుడ్ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంగా సిద్ధార్థ్-కియారాలు కూడా ఏడడుగులు వేయాలని అనుకుంటున్నారట. చదవండి: ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం.. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై నోరు విప్పని ఈజంట విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కియారా-సిద్ధార్థ్‌లు కలిసి చేసింది ఒక్క సినిమానే. దీంతో తెరపై వీరి కెమిస్ట్రీ చూసి చూడ చక్కని జంటని అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో 2022 మధ్యలో లేదా, ఏడాది చివరిలో పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నారట ఈ లవ్‌బర్డ్స్. మరి ఈ వార్తలపై కియారా-సిద్ధార్థ్‌లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన కత్రినా-విక్కీలు చివరి వరకు వారి రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన సంగతి తెలిసిందే. చదవండి: పుష్ప పార్ట్ 2 షూటింగ్‌ను నార్త్‌లో ప్లాన్ చేస్తున్న సుక్కు? బాలీవుడ్ హీరోకు కీ రోల్! -
అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ
Javed Akhtar Confirms Actor Farhan Akhtar Second Marriage: బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016లో తన భార్య అధునా బబానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్ అప్పటి నుంచి సింగర్ శిబానీ దండేకర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఫర్హాన్ స్పందించలేదు. అంతేకాదు రెండో పెళ్లిపై కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ దీంతో ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అని అందరిలో సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో ఫర్హాన్ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ క్వారిటీఇ ఇచ్చాడు. ఇటీవలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఫర్హాన్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అవును ఫర్హాన్ పెళ్లి చేసుకోబోతున్నాడని స్పష్టం చేశాడు. ‘అందరూ అనుకుంటున్నట్లుగానే ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ముహుర్తానికి డేట్ ఫిక్సైయింది. ఈ పెళ్లికి పెద్దగా ఎవరిని ఆహ్వానించడం లేదు. కొద్దిమంది సన్నిహితులు, బంధువులను మాత్రమే పిలిచాం. కరోనా పరిస్థితులు నేపథ్యంలో వారి పెళ్లిని నిరాండబరంగా ప్లాన్ చేసుకున్నారు’ అని జావేద్ అక్తర్ తెలిపాడు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇక తన కాబోయే కోడలు శిబానీపై జావేద్ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ మేరకు ఆయన శిబాని చాలా మంచి అమ్మాయి. మా కుటుంబ సభ్యులకు కూడా తను బాగా నచ్చింది. వారిద్దరికి ఎంతో కాలంగా పరిచయం ఉంది, వారిద్దరి రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఫర్హాన్, శిబానిలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవత్సరంలో అధునా బబానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పదహారేళ్లు కలిసి మెలిసి ఉన్న ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. -
రహస్య వివాహంపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
‘‘నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతే కానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి’’ అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ విషయాన్ని రెండు నెలల క్రితం రకుల్ బహిరంగంగానే తెలియజేశారు. అయితే తాజాగా వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ – ‘‘నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేనెంతో పారదర్శకంగా ఉంటాను. నాకు సంబంధించిన ఏ విషయం అయినా ఫస్ట్ నేనే చెబుతాను’’ అని పేర్కొన్నారు. ఇక భగ్నానీలో తనకు నచ్చిన అంశాల గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దరి ఆలోచనాధోరణి ఒకేలా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉదయాన్నే వర్కౌట్ చేయడం వంటి వాటిని కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టే మేం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం’’ అన్నారు. -
డైరెక్టర్‌తో త్రిష పెళ్లి.. నిజమేనా?
Heroine Trisha: త్రిష మెడలో మూడు ముడులు పడనున్నాయి.. ఏడడుగులు వేయడానికి రెడీ అయిపోయారు అంటూ కొన్ని రోజులుగా ఓ వార్త బాగా ప్రచారం అవుతోంది. ఓ తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో పడ్డారని కూడా కోలీవుడ్ అంటోంది. దాంతో త్రిష పెళ్లి ఫిక్స్ అని చాలామంది ఫిక్సయ్యారు. అయితే పెళ్లి ఫిక్స్ కాలేదట. ‘‘త్రిష పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉంది’’ అని త్రిష సన్నిహితులు పేర్కొన్నట్లుగా చెన్నై టాక్. ప్రస్తుతం మణిరత్నం దర్శ కత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు త్రిష. ఇది కాకుండా రెండు మూడు తమిళ చిత్రాలు చేస్తున్నారు. -
పెళ్లి వార్తలపై స్పందించిన విశాల్
యాక్షన్ సీన్లకు పెట్టింది పేరైన విశాల్ ఈ మధ్యే 'చక్ర' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఎప్పటిలాగే యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్న ఇది అక్కడక్కడా అభిమన్యుడు సినిమాను గుర్తు చేస్తుంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకుంటుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా వుంటే మరోసారి ఈ హీరో పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని విశాల్ దగ్గర ప్రస్తవించగా తానింకా సింగిలేనని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశాడు. "పెళ్లి అనేది ఎప్పుడు జరగాలని రాసి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేను కూడా తల వంచాల్సిందే. కానీ నేనో సక్సెస్ఫుల్ నటుడిగా, నిర్మాతగా మారతానని అస్సలు ఊహించలేదు. నా 16 ఏళ్ల ప్రయాణం ఇంత బాగా సాగుతుందనుకోలేదు. నా తర్వాతి ఇంటర్వ్యూలో మీకు తప్పకుండా ఓ శుభవార్త చెప్తా" అంటూ అభిమానులను డోలాయమానంలో పడేశాడు. కాగా విశాల్ 2019 మార్చిలో హైదరాబాదీకి చెందిన అనీశా అల్లాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏమైందో తెలీదు కానీ ఈ జంట తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె మరొకరితో ఏడడుగులు వేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇన్నాళ్లు తనలో నటనా కోణం చూపించిన విశాల్ 'తుప్పరివాలన్ 2'తో సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. చదవండి: Chakra Movie Review: 'చక్ర' వ్యూహంలో అభిమన్యుడు! వచ్చే ఉగాదికి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా -
సాహో హీరోయిన్ పెళ్లి! : 'తనిష్టమే నా ఇష్టం'
ఇష్టపడిన ప్రేయసి చేయి పట్టుకుని ఏడడుగులు నడిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో వరుణ్ ధావన్‌ను అడిగితే చెప్తారు. ఈ మధ్యే తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు నటాషా దలాల్‌కు మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు. అతడికి సినీలోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోగ్రాఫర్ రోహన్శ్రేష్ట కూడా ఈ కొత్తజంటకు విషెస్ చెప్తూ మీరు ఎంతో లక్కీ అని రాసుకొచ్చారు. దీనికి వరుణ్‌ధావన్ స్పందిస్తూ త్వరలోనే నువ్వు కూడా పెళ్లికి రెడీ అవుతున్నావని ఆశిస్తున్నానని చెప్పాడు. దీంతో అతడు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. (చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా.. మూడో స్థానంలోకి!) ఈ క్రమంలో శ్రద్ధా పెళ్లి గురించి ఆయన తండ్రి, సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందిస్తూ.. "నా కూతురు పెళ్లి గురించి బయట ఎలాంటి టాక్ నడుస్తుందో నాకు తెలీదు. కానీ ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయానికి నేను మద్దతిస్తాను. అది ఆమె పెళ్లి విషయమైనా సరే! రోహన్ శ్రేష్టనే కాదు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లికి నేను అంగీకరిస్తాను. రోహన్ చాలా మంచి అబ్బాయి. అతడు చిన్నప్పటి నుంచే మా ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇప్పటివరకైతే శ్రద్ధా తన పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. వాళ్లింకా బాల్య స్నేహితులే అనుకంటున్నాను. ప్రేమలో ఉన్నారనైతేనే భావించడం లేదు" అని చెప్పుకొచ్చారు. (చదవండి: కరోనా కష్టాలు చెప్పి బాధపడిన హీరోయిన్) -
పెళ్లంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు: హీరో
ముప్పయ్యో పడిలో అడుగుపెట్టినా సరే టాలీవుడ్ హీరోలు పెళ్లంటే వెనకడుగు వేస్తున్నారు. అయితే సడన్‌గా ఏదో మ్యాజిక్ జరిగినట్టు మొన్నటి లాక్డౌన్లో నిఖిల్, నితిన్, రానా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీంతో మరికొందరు హీరోలు కూడా బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ పెట్టనున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. ఇక అక్టోబర్ 15న చిరంజీవి అతడికి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్తూ నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో మెగా ఇంట మరో పెళ్లికి సర్వం సిద్ధం అవుతోందంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. (చదవండి: ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను డార్లింగ్, ట్రెండ్ సెట్ చేస్తా’) అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. "ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తామంటే చూసుకోండని చెప్పాను, అంతే! కానీ మీడియా వాళ్లే నా పెళ్లి వెనక పడ్డారు. ప్రస్తుతానికి పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ అమ్మాయి బాగుందని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే ఆలోచిస్తా"నని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది "ప్రతిరోజు పండగే" సినిమాతో ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. (చదవండి: అల్లుడికి చిరు బర్త్‌డే విషెస్.. ఆనందంలో హీరో!) -
పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?
దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచుకున్నారు త్రిష క్రిష్ణన్. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వరుస ప్లాపులు అవ్వడంతో వెనకబడిన త్రిష మళ్లీ 96, పేట చిత్రాల విజయం ఆమెకు మళ్లీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం త్రిష చేతి నిండా బోలేడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నటుడు శింబు, త్రిష కలిసి తమిళ చిత్రం ‘విన్నైతాండి వరువాయ’లో (తెలుగులో ఏమాయ చేశావే) నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం గతంతో సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట స్పష్టం చేశారు. చదవండి: ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్, ఎందుకబ్బా? అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్లో శుభవార్త చెబుతానంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, తొందరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది రియల్ లైఫ్ లేక రీల్ లైఫ్‌కు చెందిన విషయమా అని శింబు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ ఏడాది తమిళ నిర్మాత మండలి ఎన్నికల్లో శింబు తండ్రి టి. రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో ఓ జర్నలిస్టు ‘మీ కుమారుడు శింబు.. త్రిషతో ఏడడుగులు వేయబోతున్నారా’ అని ప్రశ్నించారు. అయితే దీనికి అవును, కాదని ఏ సమాధానం చెప్పకుండా రాజేందర్ ఈ ప్రశ్నను దాటేశారు. దీంతో త్వరలో శింబు- త్రిష పెళ్లి పీటలు ఎక్కనున్నారని మరోసారి సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వదంతులు కాస్తా నిజమే అయితే శింబు, త్రిష అభిమానులు పండగ చేసుకోనున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: వెబ్ సిరీస్‌లో త్రిష.. -
పెళ్లి వార్తలపై స్పందించిన హన్సిక
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ప్రస్తుతం 'మహా' సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రియుడు శింబు అతిథిగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే లాక్డౌన్లో వ్యక్తిగత భాగస్వామిని వెతుక్కుంటూ పెళ్లి బాజాలు మోగిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక కూడా పెళ్లికి సిద్ధమైపోయిందహో అంటూ ప్రచారం ఊపందుకుంది. ఓ వ్యాపారవేత్తతో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుందని ఈ వార్త సారాంశం. ఈ గుసగుసలు కాస్తా హన్సిక చెవిలోనూ పడింది.( వేసవిలో భయపెడతా) దీంతో ఆమె ఒక్కసారిగా నవ్వేస్తూ.. "ఇంతకీ నేను పెళ్లి చేసుకునే ఆ వ్యాపారవేత్త ఎవరో నాకూ చెప్పకూడదూ.." అని వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ఇక హన్సిక పెళ్లికూతురు కాబోతోందంటూ వచ్చిన వార్తలపై ఆమె అభిమాని ఒకరు బాగా హర్ట్ అయ్యాడు. "ఈ విషయం నాకు చెప్పనే లేదే.." అని కామెంట్ చేశాడు. దీనికి సదరు హీరోయిన్ "ఏం చేయను.. నాకు కూడా ఇప్పుడే తెలిసింది" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మ సంచలన నటుడు శింబుతో గతంలో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. (మాజీ ప్రియురాలితో..)