తీర్థ, స్నేహ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు స్నేహ పడమట, తీర్థ ఇస్కా ముందంజ వేశారు. సికింద్రాబాద్ క్లబ్ టెన్నిస్ కోర్టుల్లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో గెలుపొందారు. స్నేహ 6-2, 2-6, 7-5తో సృష్టి స్లారియా (పంజాబ్)పై, తీర్థ 7-5, 4-6, 7-5తో ముఖర్జీ (బెంగాల్)పై గెలుపొందారు. అక్షర ఇస్కా 6-2, 6-0తో జనగాం సింధుపై గెలిచింది. నిఖిత 5-7, 4-6తో సాన్యా మదన్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిశరణ్ (ఏపీ) 6-4, 6-4తో ప్రశాంత్ సెల్వరాజ్ (తమిళనాడు)పై గెలుపొందగా, వైష్ణవ్ (ఏపీ) 0-6, 2-6తో చంద్రిల్ సూద్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడాడు.