Western Digital
-
ప్రపంచంలో తొలి 22 టీబీ హార్డ్ డ్రైవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్డ్ డిస్క్ డ్రైవ్స్ తయారీ దిగ్గజం వెస్టర్న్ డిజిటల్.. అల్ట్రాస్టార్ డీసీ హెచ్‌సీ570 పేరుతో భారత్‌లో 22 టీబీ కన్వెన్షనల్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ (సీఎంఆర్) హార్డ్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టింది. ఆప్టినండ్ టెక్నాలజీతో ఇది తయారైంది. ఈ స్థాయి సామర్థ్యం గల సీఎంఆర్ హార్డ్ డ్రైవ్‌ను ప్రపంచంలో తొలిసారిగా తయారు చేసిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. క్లౌడ్ సేవల కంపెనీలు, పెద్ద సంస్థలకు వ్యయ భారం తగ్గుతుందని వివరించింది. -
వెస్టర్న్ డిజిటల్ చేతికి శాన్ డిస్క్
డీల్ విలువ 1,900 కోట్ల డాలర్లు న్యూయార్క్: మెమరీ కార్డ్‌లు వంటి స్టోరేజ్ పరికరాలు తయారు చేసే శాన్డిస్క్ కంపెనీని హార్డ్-డిస్క్ డ్రైవ్‌లు తయారు చేసే వెస్టర్న్ డిజిటల్ కార్పొ 1,900 కోట్ల డాలర్లకు (రూ.1,15,000 లక్షల కోట్లు)కొనుగోలు చేయనున్నది. శాన్డిస్క్ కొనుగోలు వల్ల స్మార్ట్ఫోన్లు, మొబైల్ డివైస్ల లో ఉపయోగించే ఫ్లాష్ మెమెరీ స్టోరేజ్ చిప్స్ తయారీకి మార్గం సుగమం అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది సెమికండక్టర్ పరిశ్రమకు సంబంధించి రికార్డ్ స్థాయిలో విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి.