మూడు రోజులుగా పొలంలో మహిళ దీక్ష
పిఠాపురం : కొత్తపల్లి మండలం కొండెవరంలో ఓ మహిళ తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదంటూ ముగ్గురు పిల్లలతో పొలంలో మూడు రోజులుగా దీక్ష చేస్తోంది. సోమవారం తెలియవచ్చిన వివరాలిలా ఉన్నాయి. కొండెవరానికి చెందిన తోలుం రా ఘవమ్మకు నలుగురు కుమార్తెలు. ఆమెకు ఇల్లు, ఎకరంన్నర భూమి ఉంది. ఇంటిని చిన్న కూతురు పెంకే వరలక్ష్మికి కట్నంగా రాసిచ్చిన రాఘవమ్మ, ఎకరంన్నర భూ మిని మిగిలిన ముగ్గురు కుమార్తెలకు సమానంగా రాసిం ది.
ఆ భూమిలో కూడా తనకు వాటా వస్తుందని తల్లిని వరలక్ష్మి అడిగింది. ఇల్లు ఇచ్చినందున భూమి ఇవ్వనని నిరాకరించడంతో తన తండ్రి ఆస్తి అయిన భూమిలో న్యాయంగా తనకు వాటా వస్తుందని, కావాలంటే తనకిచ్చిన ఇంటిని నాలుగు వాటాలు వేసి పంచాలని చెప్పిం ది. ఇప్పటికే కోత దశకు చేరుకున్న వరి పంటను కోస్తే తా ను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హె చ్చరించింది. పంటను కోయనీయకుండా అడ్డుతగులుతోందని రాఘవమ్మ కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించిం ది.
ఇద్దరినీ పిలిపించి మాట్లాడామని, సివిల్ కేసు కాబట్టి కోర్టులో తేల్చుకోవాలని చెప్పామని ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. మూడు రోజులుగా పొలం గట్టున తం డ్రి ఫొటో, కిరోసిన్ సీసా పెట్టుకుని తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, దీక్షకు దిగింది. రాత్రులు పిల్లలను ఇంటికి పంపించి, తాను, భర్తా చేను గట్టునే ఉంటున్నామని ఆమె చెప్పింది. ముందు ఇల్లే కావాలని తీసుకున్న వరలక్ష్మి ఇప్పుడు రేట్లు పెరగడంతో భూమి కావాలని నాటకమాడుతోందని ఆమె తల్లి, అక్కలు ఆరోపిస్తున్నా రు. వరలక్ష్మి దీక్ష గురించి ఎస్సైని వివరణ కోరగా, తన కు ఈ విషయం తెలియదన్నారు. మహిళా కానిస్టేబుల్‌ను పంపి, ఆమెను పోలీస్‌స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పారు.