Womens worldcup
-
ఇంగ్లండ్‌తో భారత్ కీలకపోరు.. గెలిస్తే సెమీస్‌కు!
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే గ్రూపు-2 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్ -
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 95 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు ఐర్లాండ్‌ను పతనాన్ని శాసించగా.. నిదా ధార్, ఇక్భాల్ చెరో రెండు వికెట్లు, ఫాతిమా సానా, హసన్ తలా వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సెంచరీతో చెలరేగిన మునీబా అలీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ అద్భుతమైన సెంచరీ సాధించింది. 68 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసింది. కాగా టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక మునీబాతో పాటు ధార్ కూడా 33 పరుగుల తేడాతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీన్ కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, డెన్లీ తలా వికెట్ సాధించారు. చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్‌తో.. -
World Cup 2022: ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
-
అబ్బాయిలతో ఆడటమే నా దూకుడుకు కారణం
హైదరాబాద్: అబ్బాయిలతో క్రికెట్ ఆడటమే దూకుడుగా ఆడేలా చేసిందని భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. మహిళా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చెలరేగిన కౌర్ 7 సిక్సులు, 20 ఫోర్లతో 171 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో అబ్బాయిలతో ఆడుతూ అలవోకగా సిక్సులు కొట్టడం నేర్చుకున్నానని కౌర్ గుర్తు చేసుకుంది. దూకుడుగా ఆడటం అంటే ఇష్టమని ఈ దూకుడైన శైలి చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చిందేనని ఈ వైస్ కెప్టెన్సీ చెప్పుకొచ్చింది. ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఓటమి నిరాశపరిచిందని, ఫీల్డర్స్ చుట్టుముట్టడంతో పరుగుల కోసం షాట్ ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యానని పేర్కొంది. డొమెస్టిక్ క్రికెట్లో దూకుడుగా ఆడటంతోనే అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం వచ్చిందని అయితే పెద్ద స్కోర్లు చేయలేదని కౌర్ చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నా ప్రదర్శన మరిచిపోలేనిదని ఈ మ్యాచ్ ప్రసారం కావడం అందరూ చూడటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని కౌర్ ఆనందం వ్యక్తం చేసింది.