Breadcrumb
World Cup 2022 Aus Vs Eng: ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
Published Sun, Apr 3 2022 6:18 AM | Last Updated on Sun, Apr 3 2022 1:28 PM
Live Updates
మహిళల క్రికెట్ ప్రపంచ కప్: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్
ప్రపంచకప్-2022 విజేత ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది.
The winning moment! Great catch, Gardner! #CWC22 pic.twitter.com/XXwAylzGA9
— cricket.com.au (@cricketcomau) April 3, 2022
తొమ్మిదో వికెట్ డౌన్
ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. గార్డ్నర్ బౌలింగ్‌లో జొనాసెన్‌కు క్యాచ్ ఇచ్చి చార్లెట్ డీన్ అవుటైంది. మరోవైపు నటాలీ సీవర్ 143 పరుగులతో హీరోచిత ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసు దోచుకుంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తూ తన విలువను చాటుకుంటోంది.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
కేట్ క్రాస్ రూపంలో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న నటాలీ సీవర్ ఒంటరి పోరాటం చేస్తోంది.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
మెగ్రాత్ బౌలింగ్‌లో ఎక్లిస్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 ఓవర్లలో ఇంగ్లండ స్కోరు: 207-7
కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్
ఆస్ట్రేలియా విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుస ఓవర్లలో వికెట్ కోల్పోవడంతో 30 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.
కష్టాల్లో ఇంగ్లండ్
22 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. నటాలీ సీవర్ అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ ఇంకా 218 పరుగులు సాధించాలి. అంతకుముందు జొనాసేన్ బౌలింగ్‌లో అమీ జోన్స్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది.
కెప్టెన్ అవుట్... మూడో వికెట్ డౌన్
కెప్టెన్ హీథర్‌నైట్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అలనా కింగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్
ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్‌నైట్(25 పరుగులు), బ్యాటర్ నటాలీ సీవర్(23) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మహిళా జట్టు స్కోరు: 84/2.
కొండంత లక్ష్యం.. ఆదిలోనే రెండు వికెట్లు డౌన్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ తొలి బంతికే స్టార్ బ్యాటర్ డ్యానీ వ్యాట్ మేగన్ షట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాత ఏడో ఓవర్ రెండో బంతికి బీమౌంట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఈ రెండు వికెట్లను మేగన్ తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం నటాలీ సీవర్, కెప్టెన్ హీథర్‌నైట్ క్రీజులో ఉన్నారు.
7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు:38/2
50 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 356/5
మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్ ఉమెన్ బ్యాటర్స్ విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 50 ఓవర్లకు 356/5 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఎదుట భారీ టార్గెట్‌ను ఉంచారు.
హేలీ అద్భుత ఇన్నింగ్స్‌కు తెర
అలిస్సా హేలీ రూపంలో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అన్యా శ్రుబ్సోలే బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగింది. 138 బంతులు ఎదుర్కొన్న ఆమె 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు సాధించింది.
45 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 315-1
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర అలిస్సా హేలీ 170 పరుగులు సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. 45 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 315-1
భారీ స్కోరు దిశగా ఆసీస్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓపెనర్ అలిస్సా హేలీ మెరుపు సెంచరీతో పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో 40 ఓవర్లు ముగిసేసరికి కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం హేలీ(132)తో పాటు బెత్ మూనీ(46) క్రీజులో ఉంది.
సెంచరీతో మెరిసిన అలిస్సా హేలీ
వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ అలిస్పా హేలీ జోరు కొనసాగుతోంది. ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న ఆమె సెంచరీ సాధించింది. సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకుంది.
తొలి వికెట్ డౌన్
ఎట్టకేలకు ఇంగ్లండ్‌కు బ్రేక్ దక్కింది. బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఆసీస్ ఓపెనర్ల జంటను ఎక్లిస్టోన్ విడదీసింది. ఆమె బౌలింగ్‌లో రేచల్ హాన్స్(68) బీమౌంట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో 30వ ఓవర్ తొలి బంతికి ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ అలిస్సా హేలీ(87), బెత్ మూనీ క్రీజులో ఉన్నారు.
30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు: 162-1
27 ఓవర్లలో ఆసీస్ స్కోరు 149/0
ఓపెనర్ల విజృంభణతో ఆస్ట్రేలియా మహిళా జట్టు 27 ఓవర్లలో 149 పరుగులు సాధించింది. రాచెల్ హేన్స్, అలిస్సా హేలీ వరుసగా 65, 78 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దంచికొడుతున్న ఆసీస్ ఓపెనర్లు
ఇంగ్లండ్ బౌలర్లకు ఆసీస్ ఓపెనర్లు రాచెల్ హేన్స్, అలిస్సా హేలీ చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు. 23 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మహిళా జట్టు స్కోరు: 115-0
రాచెల్ అర్ధ శతకం
మహిళా ప్రపంచకప్ ఫైనల్-2022లో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హేన్స్ అర్ధ శతకం సాధించింది.తద్వారా తాజా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ కేట్ క్రాస్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
10 ఓవర్లకు ఆసీస్ స్కోరు.. 37/0
మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు జట్టుకు శుభారంభం ఇచ్చారు. రాచెల్ హేన్స్(23), అలిస్సా హీలీ(16) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్: జట్ల వివరాలు ఇవే..
ఇంగ్లండ్ మహిళల జట్టు: టామీ బ్యూమాంట్, డేనియల్ వ్యాట్, హీథర్ నైట్(సి), నటాలీ స్కివర్, అమీ జోన్స్(w), సోఫియా డంక్లీ, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, షార్లెట్ డీన్, అన్యా ష్రూబ్సోల్
ఆస్ట్రేలియా మహిళల జట్టు: రాచెల్ హేన్స్, అలిస్సా హీలీ(w), మెగ్ లానింగ్(సి), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీగ్ గార్డనర్, జెస్ జోనాసెన్, అలనా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్
1988 తర్వాత నేడు ఇరు జట్లు ‘ఢీ’
ఈ రెండు జట్లు 1988 తర్వాత మరోసారి ప్రపంచకప్ ఫైనల్లో ‘ఢీ’కొంటున్నాయి.
మహిళల వన్డే ప్రపంచకప్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ఏడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా.. టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్.. నేడు జరిగే మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో తలపడడానికి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది.
Related News By Category
Related News By Tags
-
Aus vs Eng: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. 43 ఏళ్ల తర్వాత ఇలా!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలి...
-
స్టార్క్‌కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్‌గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగుల...
-
Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేంద...
-
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా గ్రీన్‌కు వెన్ను సంబంధిం...
-
ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
ఇంగ్లండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర పుటల్లోకెక్కాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రూక్ ఈ ఘనతను తాజాగా ...
Comments
Please login to add a commentAdd a comment