work pressure
-
కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్‌లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్‌నవూలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?
లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. ఉత్తర ప్రదేశ్ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్లోనే సదాఫ్ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది. అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024 పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది. -
EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు
పుణె: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ‘‘తనిఖీలో మా అధికారులు ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చాం. జూలైలో పెరయిల్ మరణం చుట్టూ చోటుచేసుకున్న అంశాల నివేదికను సిద్ధం చేసి ఒక వారంలో రాష్ట్ర కార్మిక కమిషనర్‌కు సమర్పించాలని ఆదేశించాం. అనంతరం ఆ పరిశీలన కొనుకొన్న ఆధారాలపై నివేదికను కేంద్రానికి పంపుతాం. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపనుంది’ అని పేర్కొన్నారు.మరోవైపు.. పని ఒత్తిడి కారణంగా ఆమె మృతిచెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగుల సంక్షేమానికి పటిష్టమైన నియమాలు, పద్దతుల అమలు తాము ఎప్పటినుంచో కట్టుబడి ఉన్నామని పేర్కొంది.చదవండి: EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం -
EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY)సంస్థలో 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మృతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత బలం అవసరమని, ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. దీనిపై అనుచిత వ్యాఖ్యలు అంటూ ప్రతిపక్ష నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు.చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇంటి నుండి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు నేర్పించాలని, దేవునిపై ఆధారపడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని ఎదుర్కోవచ్చని అన్నారు. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి అంతర్గత శక్తి ఉండాలని పేర్కొన్నారు. “భగవంతుని నమ్మండి, మనకు భగవంతుని అనుగ్రహం ఉండాలి. దేవుణ్ణి వెతకండి, మంచి క్రమశిక్షణ నేర్చుకోండి. మీ ఆత్మ శక్తి దీని నుండి మాత్రమే పెరుగుతుంది. పెరుగుతున్న ఆత్మశక్తితోనే అంతర్గత బలం వస్తుంది...విద్యా సంస్థలు దైవత్వం మరియు ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు అంతర్గత బలం వస్తుంది. అది వారి ప్రగతికి, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. అదే నా దృఢమైన నమ్మకం,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు అంబానీ, అదానీ దిగ్గజాల బాధ తప్ప సామాన్యుల బాధ కనిపించదు, ఎన్నో ఆశలతో వస్తున్న అన్నా లాంటి యువకులు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి బలైపోతున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ), కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు. Dear Nirmala Sitaraman ji,Anna had inner strength to handle the stress that came with pursuing a gruelling Chartered Accountancy degree. It was the toxic work culture, long work hours that took away her life which needs to be addressed. Stop victim shaming and atleast try to be… pic.twitter.com/HP9vMrX3qR— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 23, 2024 చార్టర్డ్ అకౌంటెన్సీ డిగ్రీని చదవడంలోనే అన్నా అంతర్గత బలం ఎంతోఉంది. కానీ విషపూరితమైన పని సంస్కృతి, సుదీర్ఘ పని గంటలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. బాధితురాలిని అవమానించడం ఆపండి, కనీసం కొంచెం సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి, మీరు కోరుకుంటే దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. అటు అన్నా సెబాస్టియన్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. పని భారం వల్లే అన్నా మృతి చెందిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, ఈ వ్యవహారంలో స్వయంచాలకంగా విచారణ ప్రారంభించింది. నాలుగు వారాల్లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను అందజేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.కాగా ఎర్నాకులం కున్నప్పిల్లికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిలో నాలుగు నెలలకే, తీవ్ర ఒత్తిడి, గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె తల్లి కంపెనీ చైర్మన్‌కు ఈమెయిల్ రావడంతోఈ విషయంలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్త మైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది.కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్లోతెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. Deeply saddened by the tragic loss of Anna Sebastian Perayil. A thorough investigation into the allegations of an unsafe and exploitative work environment is underway. We are committed to ensuring justice & @LabourMinistry has officially taken up the complaint.@mansukhmandviya https://t.co/1apsOm594d— Shobha Karandlaje (@ShobhaBJP) September 19, 2024అన్నా మరణం చాలా బాధాకరమైందంటూ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్‌పై ఆమె స్పందించారు. (ఇదీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్నిభరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్ ఈమెయిల్ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిపరిస్థితులపై చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ
కష్టపడి చదవి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలని ఆశపడింది కలలు కనింది 26 ఏళ్ల యువతి. కానీ ఆశలన్నీ ఆవిరై తన తల్లిదండ్రులకే తీరని శోకాన్ని మిగల్చబోతున్నానని కలలో కూడా ఊహించి ఉండదు. ఎన్నో ఆశలతో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో యువతి తల్లి తీరని విషాదంలో మునిగిపోయింది. పని ఒత్తిడితో, తన బిడ్డ కలల్ని, జీవితాన్ని నాశనం చేశారు, తనలాగా మరే తల్లికి ఇలాంట దుర్గతి పట్టుకూడదంటూ కంపెనీ చైర్మన్‌కి పంపిన ఈమెయిల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..కేరళకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరైల్ బహుళజాతి సంస్థ ఎర్నెస్ట్ & యంగ్, EYలో ఉద్యోగంలో చేరింది. తొలి ఉద్యోగం కావడంతో చాలా కష్టపడి చేసింది. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలని రాత్రింబవళ్లు పనిచేసి తన టార్గెట్‌ను పూర్తి చేసింది. అయినా ఆమె మేనేజర్ చేసిన ఒత్తిడిని ఆమె గుండె తట్టుకోలేకపోయింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే 26 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన బిడ్డ విషాదాంతానికి కారణం పని ఒత్తిడే అంటూ అన్నా తల్లి, అనితా అగస్టిన్ ఆ కపెంనీ ఛైర్మన్ ఇండియా చీఫ్ రాజీవ్ మెమనికి ఇమెయిల్ రాశారు. తన కుమార్తె మరణానికి దారితీసిన పరిస్థితులపై తన బాధను వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల పనిపరిస్థితులపై చర్చకు దారి తీసింది. ఆసియా దేశాల్లోఅంతే,టాక్సిక్‌కల్చర్, దుర్మార్గం అంటూ సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు. ఈమెయిల్ అన్నా తల్లి బరువెక్కిన గుండెలతో రాసిన ఈమెయిల్ సమాచారంలో అందించిన వివరాల ప్రకారం అన్నా సెబాస్టియన్ పెరైల్ బాల్యం నుంచీ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచీ చదువులో,ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో రాణించింది. స్కూల్ టాపర్, కాలేజీ టాపర్. అంతేకాదు సీఏ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ‘‘నా బంగారు తల్లిని పొగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆరోగ్యం, జీవితం కన్నా, ఏదీ ఎక్కువ కాదని ఆమెకు నచ్చజెప్పి, బిడ్డను కాపాడుకోవలసింది. ఈ బాధతోనే ఈ లేఖ రాస్తున్నా.. ఆమె గురించి రాస్తోంటే.. నా గుండె బద్దలవుతోంది. నా శోకం, బాధ మరే కుటుంబానికి రాకూడదనే ఇది రాస్తున్నాను.2023 నవంబరులో సీఏ పాస్ అయింది. 2024 మార్చి19న పూణేలో ఉద్యోగంలో చేరింది. అంత గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు పొంగిపోయింది. ఉద్యోగంలో చేరిన కంపెనీ కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. పగలూ, రాత్రి, చివరికి ఆదివారాలు కూడా పని చేసేంది. ఉద్యోగం, ఊరు, భాష అన్నీ కొత్త అయినా సర్దుకుపోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది.పడుకున్నా, కూర్చున్నా పనిధ్యాసే. సరిగా తిండి లేదు. నిద్ర లేదు. అంతులేని ఒత్తిడిని భరించింది. శారీరకంగా, మానసికంగా అలిసిపోయినా, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి కీలకమని నమ్ముతూ నెట్టుకుంటూ వచ్చింది. ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పని చేసి, చేసి చివరికి ఆ ఒత్తిడితోనే నాలుగు నెలల తర్వాత, జూలై 20 శాశ్వతంగా నాకు దూరమైపోయిందన్న వార్త విన్నాక నా ప్రపంచం కుప్పకూలింది. 26 ఏళ్లకే నా బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కనీసం ఆమె అంత్యక్రియలకు కంపెనీ తరపునుంచి ఒక్కరుకూడా రాలేదు. ఇదింకా నన్ను బాధించింది.జూలై 6వ తేదీన నేను, నాభర్త సీఏ కాన్వకేషన్ కోసం పూణే వచ్చాం. అప్పుడే గుండెల్లో ఏదో భారంగా ఉందని చెప్పింది అన్నా. డాక్టర్ దగ్గరికెళ్లేందుకు ఆమె సమయం దొరకలేదు. కానీ బలవంతంగా ఆసుపత్రికి వెళ్లాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయినీ, ఆందోళన అవసరం లేదని కార్డియాలజిస్ట్ చెప్పారు. కానీ తిండి, నిద్ర సమయానికి తీసుకోవడం లేదని, విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని గమనించలేదు. జూలై 7, ఆమె కాన్వకేషన్ రోజు అపుడు కూడా ఆమెకు సెలవు దొరకలేదు. ఆ రోజు కూడా మధ్యాహ్నందాకా వర్క్ ఫ్రం హోం చేసింది. దీంతో కాన్వకేషన్‌కు లేట్‌గా వెళ్లాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రులను తన కాన్వకేషన్‌కు తీసుకెళ్లాలనేది నా కుమార్తె గొప్ప కల. ఆమె మా విమాన టిక్కెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకువెళ్లింది. మా బిడ్డతో చివరిగా గడిపిన ఆ రెండు రోజులు కూడా పని ఒత్తిడి కారణంగానే మాతో ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఇది తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. తరచుగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో మీటింగ్‌లను రీషెడ్యూల్ చేసేదట ఆమె టీమ్ మేనేజర్. చివరి నిమిషంలో పని ఒత్తిడి పెంచేదట. ఆమె కింద పనిచేయడం నీ బ్యాడ్ లక్ అని ఒక ఆఫీస్ పార్టీలో, ఒక సీనియర్ లీడర్ చెప్పాడట అన్నాతో. అయినాదురదృష్టవశాత్తూ, తప్పించుకోలేకపోయింది. ధిక పని భారం కారణంగా చాలామంది ఉద్యోగులు రాజీనామా చేశారని కూడా తెలిపింది. దయచేసి ఇలాంటి పరిస్థితి మరో ఉద్యోగికి రాకుండా జాగ్రత్తపడండి. ఇంత పెద్ద కంపెనీలో కనీస మానవహక్కులను పట్టించుకోకపోతే ఎలా? మీ హెచ్ఆర్ కాపీ మొత్తం చదివాను.ఇది నా కుమార్తె గురించి మాత్రమే కాదు, ఎన్నో ఆశలు, కలలతో మీ కంపెనీలో చేరి ప్రతి యువ నిపుణుడి గురించి కూడా. అన్నా మరణం మీ కంపెనీకి ఒక హెచ్చరిక లాంటిది.మీ సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం ఇది, ఆచరణ సాధ్యంకాని అంచనాలతో వారిపై ఒత్తిడి పెంచకండి.మీ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోండి.నాబిడ్డ అనుభవం నిజమైన మార్పుకు దారితీస్తుందని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి దుఃఖం ఏ ఇతర కుటుంబమూ రాకుండా చూడండి. నా అన్న ఇప్పుడు మాతో లేదు. కానీ ఆమె గాథ మార్పుకు నాంది కావాలి..’’ అంటూ రాసుకొచ్చారు అనితా అగస్టిన్. అయితే దీనిపై కంపెనీనుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.అలాగే అన్నా మరణానికి అసలైన కారణాలు ఏమిటి అనేదానిపై స్పష్టత లేదు. -
రోబో ఆత్మహత్య! కారణం అదేనా..
పని ఒత్తిడి ఎక్కువైతే డిఫ్రెషన్‌లోకి వెళ్లడం.. ఆత్మహత్య చేసుకోవడం వంటివి మనుషులే చేస్తారు. అయితే రోబోట్స్ కూడా ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాయని ఇటీవలే ఓ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. రోబోట్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అని చాలామందికి అనుమానం రావొచ్చు? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్‌గా పనిచేస్తున్న రోబోట్.. ఇటీవల 'రోబో సూపర్వైజర్'గా పిలువబడే రోబోట్ కౌన్సిల్ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది. దీనిని మొట్టమొదటి "రోబోట్ ఆత్మహత్య"గా చెబుతున్నారు.సిటీ కౌన్సిల్ అధికారులు వెంటనే స్పందించారు. పగిలిన రోబోట్ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. ఇది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోబోట్ ఎక్కువ పని చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు.రోబోట్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడే ఏదో వెతుకుతున్నతలు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు రోబోట్ పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయడం వల్లనే రోబోట్ ఆలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే.. సౌత్ కొరియాలో రోబోట్స్ వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ వెల్లడించింది. కాగా రోబోట్ నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. -
భారత్‌లో బాధపడుతున్న ఉద్యోగులు ఎందరంటే..
భారత్‌లో వందలో 86 మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారని ‘గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్’ నివేదిక వెల్లడించింది. మిగతా 14 శాతం మంది వృత్తిపరంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉన్న 34 శాతం ఉద్యోగులతో పోలిస్తే తక్కువ.గల్లుప్ 2024 స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ వర్క్‌ప్లేస్ నివేదిక రూపొందించేందుకు ఉద్యోగులను మూడు కేటగిరీలు(అభివృద్ధి చెందుతున్న, కష్టపడుతున్న, బాధపడుతున్న ఉద్యోగులు)గా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుత వృత్తిజీవితంతోపాటు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారిని అభివృద్ధి చెందుతున్నవారిగా పరిగణించారు. దీనికి విరుద్ధంగా వృత్తిలో ప్రతికూల వాతావరణాన్ని అనుభవిస్తున్నవారు, రోజువారీ ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలను ఎదుర్కొంటున్నవారిని ‘కష్టపడుతున్న, బాధపడుతున్న’ కేటగిరీలోకి చేర్చారు.నివేదికలోని వివరాల ప్రకారం..భారత్‌లో 86 శాతం మంది ఉద్యోగులు కష్టపడుతూ, బాధపడుతూ పనిచేస్తున్నారు. 14 శాతం మంది వృత్తిపరంగా తాము నిత్యం అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 34 శాతం ఉద్యోగులున్నారు. దక్షిణాసియాలో ఇలా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో 15 శాతం ఉద్యోగులున్నారు. నేపాల్ ఇది 22 శాతంగా ఉంది. శ్రీలంకలో అత్యధికంగా 62 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 58 శాతం ఉద్యోగులు రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఇది 32 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, పనిఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉద్యోగులు మంచి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ యాజమాన్యాలు టార్గెట్లు పూర్తి చేయాలనే ధోరణిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులపై ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఇతర మంచి మార్గాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, వృత్తిపరంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం..వంటివి పాటించాలని సూచిస్తున్నారు. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
రోజుకు 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగికి డాక్టర్ సలహా..
కార్పొరేట్ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది. కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే.. ట్విటర్లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను ట్విటర్లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు. దీంతో డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. 1. Reduce working hours by 50%, and ensure an unemployed person gets a job (whose job you are doing in addition to yours) (+follow other advice from the pinned post on my timeline) https://t.co/wThD7cEvMt — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023 ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం.. చిన్న విషయాలకే భయం అంటూ..
సాక్షి, ప్రకాశం (టంగుటూరు): భరించలేని పని ఒత్తిడి ఓ వైపు.. ఆందోళన మరో వైపు వెరసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి కారణమైంది. ఈ సంఘటన స్థానిక వాణి నగర్ మొదటి వీధిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఉద్యోగులు కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య నర్నత్ రణ్‌దేవ్ (24) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు పిన్ని, బాబాయి పెంచి పెద్ద చేశారు. ఉన్నతంగా చదువుకున్న ఐశ్వర్య పట్టుదలతో రెండేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగం సాధించింది. ఆరు నెలల క్రితం టంగుటూరి సిండికేట్ బ్యాంక్ శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అయితే చిన్న పనులకే ఒత్తిడి గురవుతుండేదని తోటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం అధికారులకు రిజైన్ పత్రాలను అందించింది. కానీ ఉద్యోగం లేకపోతే ఏం చేయాలో తెలియక.. ఈ పని చేయలేక మానసికంగా కుంగిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య తాను నివసిస్తున్న బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బంధువులు ఫోన్ చేయడంతో.. ఐశ్వర్య పిన్ని, బాబాయ్‌లు రోజూ ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడుతుంటారు. అలాగే ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటలకు ఫొన్ చేయగా తీయలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్‌కు ఫోన్ చేశారు. మేనేజర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉదయం 9: 30 గంటలకు అటెండర్‌ను ఆమె ఇంటికి పంపించారు. అతను ఇంటి యజమానితో కలిసి పైకి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా పలక్కపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరి వేసుకొని అప్పటికే మృతి చెందింది. ఎస్సై ఖాదర్ బాషా, సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించారు. యువతి కుడి చేతి మణికట్టుకు ఉన్న దారంలో ఉంచిన లెటర్, ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని.. పని ఒత్తిడి, చిన్న విషయాలకే భయం అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు. -
కరోనా వచ్చినా జీతం కట్ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
సాక్షి, మేడిపెల్లి(జగిత్యాల): పంచాయతీల్లో కార్యదర్శులు పాత్ర కీలకం. అభివృద్ధి పనులతోపాటు పారిశుధ్య, ఇతర పనులు పర్యవేక్షిస్తారు. పెరిగిన పని ఒత్తిడికి తోడు కరోనా సమయంలో సెలవులో ఉంటే జీతంలో కోత విధించడం మరింత ఆవేదనకు గురి చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఆరోగ్యభద్రతతోపాటు వందశాతం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అరకొర జీతం పల్లెప్రగతితోపాటు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, ఇంటిపన్నులు, ఇతర పన్నుల వసూళ్లు, ఇంటినిర్మాణ పనులతోపాటు ఇతర పనుల నిర్వహణ వీరిపైనే ఉంది. గతేడాది నుంచి ఉపాధి పనుల నిర్వహణతో కరోనా సోకిన వారి ఐసోలేషన్ సహా ఇతర ఏర్పాట్లు చూడడం వీరిపైనే పడింది. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించడం, మండల పరిషత్‌లో మీటింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి. ఏమైనా తేడా వస్తే వీరినే మొదటి బాధ్యుడిగా చేస్తూ మెమోలు జారీ చేస్తున్నారు. ఇంతచేస్తున్నా వారికి ఇచ్చే జీతం అరకొరే. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సెలవుపెడితే జీతం కట్ జిల్లాలో 380 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 107 మంది కార్యదర్శులు కరోనాబారినపడ్డారు. విధి నిర్వహణలో కోవిడ్‌బారిన పడుతున్నారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. కోవిడ్ బారినపడ్డ వారు 15 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉండాల్సిందే. కానీ పంచాయతీ కార్యదర్శులు హోంక్వారంటైన్లో ఉంటే వారి జీతాలు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు వచ్చే రూ.15వేల నుంచి సగం జీతం పోతే మిగిలేది రూ.7,500 మాత్రమే. కొన్ని మండలాల్లో మాత్రం ఎంపీడీవోలు మానవతా దృక్పథంతో కోవిడ్ వచ్చిన వారికి జీతాలు కట్ చేయక చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే కోవిడ్ వచ్చిన వారికి మంచి చికిత్స చేయించడంతోపాటు జీతంలో కోతలేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యభద్రత కరువు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆరోగ్యభద్రత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన లేదా ఏ ఇతర అనారోగ్య సమస్యలతో చేరినా ఆరోగ్యభద్రత కార్డులు లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా హెల్త్‌కార్డులు ఉంటే ఆర్థికంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు వందశాతం హాజరు కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది. పని భారం పెరిగింది గతంతో పోల్చితే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏడాది నుంచి అదనంగా ఉపాధి పనుల నిర్వహణ అప్పగించడంతోపాటు కరోనా మహమ్మారితో పనిభారం పెరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్‌కార్డులు లేకపోవడంతోపాటు పెంచిన జీతాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. – నవీన్‌రావు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల -
ఉద్యోగమే నా చావుకు కారణం
జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన ఎం.జగన్నాథ్ మిన్పూర్ గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, అవమానాలు భరించలేక ‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘నేను పనిచేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ల చిల్లర రాజకీయాలు భరించలేకపోయాను. గ్రామ ఇన్చార్జి సర్పంచ్, 7వ వార్డు సభ్యుడు తమకు సహకరించలేదని, చాలా వేధింపులకు గురి చేశారు. మార్చి 3న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అధికారులకు లేఖ ఇచ్చాను. తోటి ఉద్యోగులు, అధికారులు నచ్చచెప్పడం.. అలాగే ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటే అమ్మానాన్నలకు బాధ కలుగుతుందని భావించి మళ్లీ విధుల్లో చేరాను. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నా డు. ‘ఏపీవో నన్ను కుక్కలా తిప్పుకున్నారే కానీ, ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు చేయించిన పనులకు పేమెంట్స్ ఇవ్వలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్ ఫిల్లింగ్, పోల్స్ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌కు, ఆడిటింగ్‌లకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలి. నాకు బతకాలని ఉన్నా, ఇలా బతకడం నావల్ల కావడం లేదు’అంటూ సూసైడ్ నోట్ ముగించాడు. అధైర్యపడొద్దు... పంచాయతీ కార్యదర్శులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం. గ్రామా ల్లో రాజకీయంగా ఇబ్బందులుంటే అధి కారుల దృష్టికి తీసుకెళ్లాలి. జగన్నాథ్ ఆత్మహత్య చాలా బాధాకరం. –ఎస్.రమేశ్, జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు -
హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితలో ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్వరూప్ నగర్‌కు చెందిన బాల సుదర్శన్ (38) కింగ్ కోఠి ఆంధ్రా బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య, ఇద్దరు కూతుళ్లు నిద్రిస్తుండగా బాల్కానీలోని హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సుదర్శన్ కుటుంబసభ్యులు మాత్రం పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలి
సాక్షి, ములుగు: పంచాయతీ కార్యదర్శుల పనిభారం తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం డీఆర్వో కూతాటి రమాదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తట్టుకోలేక నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటమండలం గుమ్మడిగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గురువారం ఆత్మహత్య చేసుకుందన్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు పేస్కేల్ , ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న స్రవంతి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్సిగ్రేషియ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కొండల్‌రెడ్డి, చిరంజీవి, ఇమ్మడి దామోదర్ ఆయా గ్రామల పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
బాబోయ్ డ్యూటీనా?
ఖమ్మంమామిళ్లగూడెం: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న డ్రైవర్లపై ఇటీవల కాలంలో పనిభారం అధికమవుతోంది. సిబ్బంది కొరతతో అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని, అలసిపోతున్నామని, ఒత్తిడితో ఆందోళన చెందుతున్నామని కొందరు ఆవేదన చెబుతున్నారు. ఒక డ్రైవర్చేతనే రెండు మూడు రోజులు డబుల్ డ్యూటీ (డీడీ)ల పేరుతో వరుస డ్యూటీలు చేయించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తీరుతో అద్దె బస్సుల డ్రైవర్లు వారంపది రోజులు వరుస డ్యూటీలు చేస్తున్నారు. డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే సమయం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఖమ్మం రీజియన్‌లో రోడ్డు రవాణా సంస్థకు సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా పీడిస్తోంది. డ్రైవర్, కండక్టర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయట్లేదు. రీజియన్‌లో 1117 డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 1136 కండక్టర్లు విధులు నిర్వహిస్తుండగా, 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే..ఇంకా అదనంగానే సిబ్బంది అవసరమవుతారని కార్మిక సంఘాల నాయకులంటు న్నారు. మొత్తం 630 బస్సులకు గాను 600కు పైగా సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లెక్క ప్రకా రం 1400 మంది డ్రైవర్లు అవసరం. ఖమ్మం డిపోలో అయితే డ్రైవర్ డ్యూటీ దిగడమే ఆలస్యం గేటువద్ద అధికారులు వారిని అడ్డుకొని అదనపు డ్యూటీ చేస్తే అడిగినప్పుడు సెలవు ఇస్తామని, డీడీ నగదు ఇస్తామని ఆశలు చూపించి డ్రైవర్ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అదనపు ట్రిప్పులు తిప్పిస్తున్నారు. అనారోగ్యంపాలైన కార్మికుడు సెలవు అడిగితే కుదరదు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఓటీలు, డీడీలతో కార్మికులకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల్లో అధికశాతంమంది అనారోగ్యాలపాలై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందనేది బహిరంగ రహస్యమే. అధికారుల అవగాహన లేమి.. రీజియన్ పరిధిలోని డిపోల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు రూట్లపై సరైన అవగాహన లేకపోవడంతో కార్మికుల పట్ల శాపంగా మారింది. పలు రూట్లలో కిలోమీటర్లు పెంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోడ్లు బాగాలేకపోయినా సమయం తగ్గించి, కిలోమీటర్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖమ్మం నుంచి రాజమండ్రి, సూర్యాపేట, కోదాడ రూట్లలో తిరగే బసుల సమయం తగ్గించారు. రాజమండ్రి రోడ్డు బాగాలేకపోయినా గతంలో ఉన్న ప్రయాణ సమయం తగ్గించడంతో సకాలంలో చేరుకునేందుకు డ్రైవర్ ఒత్తిడికి గురవుతున్నాడు. 40 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న కోదాడ ప్రాంగణానికి 1:15 గంటల సమయం మాత్రమే ఇవ్వడంతో..స్టాప్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు అతివేగంగా వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు. విశ్రాంతి ఎక్కడ ? సంస్థలోని కార్మికులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా విధులు నిర్వహిస్తుంటే..వారు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులే లేవు. రిజియన్లో ఆరు డిపోలు ఉండగా వాటిలో సగానికి పైగా విశ్రాంతిగదులు లేనివే. డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు ఉన్న గంట, రెండు గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ దారుణం. వారికైతే రెస్ట్ రూముల్లో కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండవు. నైట్ అవుట్ బస్సుల డ్యూటీ చేసే కార్మికుల ఇబ్బందులైతే అన్నీఇన్నీ కావు. రాత్రి వేళ..గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై, పంచాయతీ కార్యాయాల బయట నిద్రిస్తున్నారు. గది సౌకర్యం లేకపోవడంతో విష పురుగుల భయంతో నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి పోవట్లేదు. డ్రైవర్లకు శిక్షణే లేదు.. ఆర్టీసీలో పని చేసే డ్రైవర్, కండక్టర్లకు సంస్థ నెలకోమారు డిపోల్లో తరగతులు, 6 నెలలకోసారి రీజియన్ స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ..ప్రసతం శిక్షణ తరగతులే లేవు. రెండు సంవత్సరాలుగా డ్రైవర్లకు ట్రైనింగ్ నిలిచిందంటే సంస్థ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణలో ప్రతి కార్మికుడికీ నూతన మెళకువలు నేర్పడంతో పాటు రోడ్డుపై వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంటారు. ఇలాంటి తరగతులు లేకపోవడంతో డ్రైవర్లు తమకు ఇస్తున్న బస్సులతో రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను అధిగమించి పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
డ్రైవరన్నా.. జర పైలం!
ఏంటి.. నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా.. నిద్రే.. కానీ శాశ్వత నిద్ర.. అకస్మాత్తుగా గుండెపోటు వస్తే.. తన ప్రాణాలను ఉగ్గబెట్టుకుని.. మనలాంటి ఎందరో ప్రాణాలను కాపాడిన ధీరుడితడు. తనకు ప్రాణప్రదమైన స్టీరింగ్‌పైనే ప్రాణాలను విడిచిన ఆర్టీసీ డ్రైవర్ ఇతడు.. సాక్షి, హైదరాబాద్: ఒక అరుణాచలం.. ఒక తాజ్‌బాబా.. ఒక విష్ణు.. పేరేదైతేనేం.. ఇలాంటి ఎందరివో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద బస్సులో టికెట్లు ఇస్తోన్న కండక్టర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తెలంగాణ ఆర్టీసీలో ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు వందల్లో ఉంటున్నాయి. ప్రాణాంతక వ్యాధులతో చాలామంది ఆయువు ముగియకముందే.. అకాలమరణం చెందుతున్నారు. పని ఒత్తిడి, వేళాపాళాలేని పని వేళల కారణంగా కార్మికులు పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం కార్మికులను, వారి కుటుంబాలను కబళిస్తున్నాయి. గుండెపోటు కార్మికులను క్షణాల్లో విగతజీవులుగా మారుస్తుంటే.. పక్షవాతం జీవితాంతం జీవచ్ఛవాలుగా మారుస్తోంది. వీరికే ఎందుకిలా? ఆర్టీసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందనేది కాదనలేని వాస్తవం. రెండు, మూడు రోజులు వరుసగా విధులు నిర్వహించాల్సి రావడంతో కార్మికులు శారీరకంగా అలసిపోవడం, కుటుంబానికి దూరమై మానసికంగా కుంగిపోతున్నారు. వీరి జీవనశైలి కూడా శరీరంలోకి పలు రోగాలను మోసుకొస్తోంది. వేళకు తినరు, నిద్రపోరు. దీంతో గ్యాస్, అల్సర్, అజీర్తి వంటి సమస్యలు విధుల్లో చేరిన కొన్ని నెలల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల పైల్స్, గంటల కొద్ది నిద్రను కోల్పోవడంతో కంటి సమస్యలు డ్రైవర్లను పీడిస్తున్నాయి. ఇక కండక్టర్లు నిల్చోవడం వల్ల కీళ్ల నొప్పులు, వెరికోసిస్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. శరీరంలో సరిపడా నీరు లేక కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వీటికితోడు అధికారుల వేధింపులు, చలానాలు రాయడం, మెమోలు ఇవ్వడం తదితర సమస్యలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇవే దీర్ఘకాలంలో గుండె సమస్యలు, పక్షవాతానికి కారణమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నియామకాలేవీ..? ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 700 మంది శ్రామిక్‌లు, 440 మెకానిక్‌లు, 460 ఆర్టిజెన్స్ పోస్టులను సంస్థ నేరుగా రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవు. 2011 నుంచి నేటి వరకు దాదాపుగా 7 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో దాదాపుగా 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు జూన్‌లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. కానీ, ఈ విషయంలో ఎలాంటి పురోగతిలేదు. ఈ భర్తీలు లేకపోవడంతో ఇప్పుడున్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. ఎన్ఐఎన్ సేవలు వద్దా? ప్రతీరోజు వందలాది మంది కార్మికులు పై సమస్యలతో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వస్తున్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తార్నాకలోనే ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సలహాలు తీసుకుంటే తప్పేంటని పలువురు సూచిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేసే కార్మికులకు ఎలాంటి డైట్ తీసుకుంటే బావుంటుందన్న సలహాలను తీసుకునే ఓపిక లేదా అని అశోక్ (ఎన్ఎంయూ) ప్రశ్నిస్తున్నారు. డైట్ పాటిస్తే కార్మికులకు ఇప్పుడు వస్తున్న చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అంటున్నారు. నియామకాలు చేపట్టాలి ప్రపంచీకరణ వల్ల చాలా మార్పులు వచ్చాయి. దీనిలో భాగంగా 8 గంటల పని విధానాన్ని మార్చాలి. పని గంటలను 6 గంటలకు కుదించాలి. పని భారం తగ్గించాలి. వరుస డ్యూటీలు వేయడం మాను కోవాలి. కొత్త నియామకాలు చేపట్టాలి. –నాగేశ్వరరావు, చైర్మన్, ఎన్ఎంయూ ఎంతమంది మరణించారు? -
భర్తలూ చిన్న పిల్లలే!
సాక్షి, హైదరాబాద్: పసి పిల్లలు తమ తల్లులను చాలా ఒత్తిడికి గురి చేయడం చూస్తూనే ఉంటాము. అయితే భర్తలు కూడా అదే స్థాయిలో తమను ఒత్తిడికి గురి చేస్తున్నారని గృహిణులు అభిప్రాయపడుతున్నారు. కర్తవ్య నిర్వహణలో కూడా మహిళలు ముందుండి వారిని ప్రోత్సాహించాల్సి వస్తోందని టుడే.కామ్ అనే వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఏమిటా సర్వే..? మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్న అంశాలేమిటి అని 7000 మందికి పైగా తల్లులను ఆ వెబ్సైట్ ప్రశ్నించింది. ఇంట్లో ఉన్న పలు పనులను భర్తతో పంచుకోవడం ఎలా ఉందని అడిగారు. అలాగే ఇంటి పనులు, పిల్లల పెంపకం, భర్తను చూసుకోవడం ఎలా ఉందంటూ పలు కోణాల్లో ప్రశ్నలను అడిగారు. కనుక్కున్నదేమిటంటే..... ! ఈ ప్రశ్నలకు గృహిణులు ఇచ్చిన సమాధానాలు షాకింగ్‌గా ఉన్నాయి. తమ పిల్లల కంటే భర్తలే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారని 46 శాతం మంది తల్లులు చెప్పారు. పిల్లలకు చేసినట్లే చాలా పనులు భర్తకూ చేయాల్సి వస్తోందని వాపోయారు. అత్యధిక ఒత్తిడిని (10 పాయింట్లలో 8.5 పాయింట్లు) తల్లులు అనుభవిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. తల్లులు ఎందుకిలా భావిస్తున్నారు..? సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు పిల్లలను చూసుకోవడంతో పాటు ఇంటి పనంతా తామే చేయాల్సిరావడం వల్ల ఇలా భావించామన్నారు. ప్రతీ అయిదుగురిలో ఒకరు తమ భర్త ఇంటి పనుల్లో చిన్న సహాయం కూడా చేయట్లేదని అన్నారు. ఇది మాత్రమే గాక పనుల్లో చిన్న ఆలస్యమైనా కోప్పడుతున్నారని బాధపడ్డారు. ఇప్పుడేం చేయాలి..? ఒకవేళ మీ భర్త చిన్న చిన్న పనులకే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాడని అనిపిస్తే వెంటనే ఈ విషయాన్ని సావధానంగా అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఒత్తిడి ఎక్కువైతే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానితో పాటు పిల్లల పెంపకం మీదా, వారి చదువుల మీదా, ఇంటి పనుల మీద అది ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి భర్తలే ముందడుగు వేసి రోజువారి పనులను సమానంగా పంచుకోవడానికి ప్రయత్నించాలి. భర్త అంటే భరించేవాడు అన్న విషయాన్ని పురుషులు గుర్తుంచుకోవాలి. ఈ ఆధునిక యుగంలో కూడా మహిళలను వంటింటికే పరిమితం చేయాలనుకోవడం సరైనది కాదు. భాగస్వామి చేయాల్సిన పనులన్నింటినీ చేయకపోయినా కొద్దిగ తోడ్పాటును వారికి అందిస్తే మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. -
న్యాయమూర్తులపై పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, దీనిని అందరూ అంగీకరించి తీరాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తాను సీజేగా బాధ్యతలు చేపట్టి నెల రోజులే అవుతోందని, కాబట్టి న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి అర్హులైన న్యాయవాదుల పేర్లను సిఫారసు చేసే విషయంలో కొంత సమయం పడుతుందని తెలిపారు. ఖాళీల భర్తీకి కృతనిశ్చయంతో ఉన్నామని, కొన్ని సందర్భాల్లో తొందరపడితే మొత్తం వ్యవహారం చెడిపోతుందని సీజే వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి రావాలనుకుంటున్నారా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఖాళీల భర్తీ విషయంలో కొంత కాలం వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. తదుపరి విచారణను నెల రోజులకు వాయిదా వేశారు. ఈ మేరకు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ రాజ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించారని, అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేసులు సకాలంలో పరిష్కారం కాకపోవడానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం ఒక్కటే కారణం కాదని, న్యాయవాదులు సైతం పదే పదే వాయిదాలు కోరడం కూడా ఓ కారణమని పేర్కొంది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సానుకూల దృక్పథంతో ఉండాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
రెవెన్యూ సమస్య
అసలే సిబ్బంది కొరత.. ఆపై అదనపు పనిభారం.. రికార్డుల ప్రక్షాళనకు తక్కువ గడువు.. వేధిస్తున్న సాంతికేక సమస్యలు.. దీంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి తగ్గించకపోతే సమ్మె బాట పట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి క్రైం : భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన వి షయం తెలిసిందే. మూడు నెలల్లో రికార్డుల ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. దీంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి రె వెన్యూ అధికారులు, సిబ్బంది తీరికలేకుండా పనిచేసి మొదటి విడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపై రైతుబంధు అమలు, పాస్బుక్కుల జారీ తదితర ప్రక్రియలోనూ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆగమేఘాల మీద పనులు చేయాల్సి రావడంతో పాసుబుక్కులు, రైతుబంధు చెక్కుల్లో చాలా పొరపాట్లు దొర్లాయి. ఇదే సమయంలో రికార్డుల ప్రక్షాళనకు ఉపయోగిస్తున్న సా ఫ్ట్‌వేర్ తరచుగా మొరాయిస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. ప్రక్షాళన, రైతుబం ధు పాస్‌పుస్తకాల, చెక్కుల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ, తప్పుల సవరణ తదితర పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. దీంతో సిబ్బం ది ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఓవైపు సాంకేతిక సమస్యలతో పనులు ఆలస్యం అవుతుండడం, మ రోవైపు త్వరగా పనులు పూర్తి చేయాలంటూ అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో మానసి కంగా ఇబ్బంది పడుతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు సిబ్బంది కొరత వేధిస్తోందని, దీం తో పనులు వేగంగా సాగడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం గత సెప్టెంబర్ 15 న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మూడు నెలల్లో ప్రక్షాళన పూర్తవుతుందనుకున్నారు. ఇప్పటికి పది నెలలు గడిచినా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా పార్ట్–బి కి సంబంధించిన భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించనే లేదు. ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా పని ఒత్తిడి నుంచి బయటపడేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు. విధుల్లో ఒత్తిళ్లు... భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం అయ్యాక రెవెన్యూ సిబ్బందికి పనిభారం ఎక్కువైంది. భూ సర్వే, వివరాల నమోదు, ఆన్లైన్ ఎంట్రీలు, వన్ బీల తయారీ, తప్పుల సవరణ, ఫిర్యాదుల స్వీకరణ, డిజిటల్ పాస్బుక్కుల తయారీకి ఏర్పాట్లు, రైతు బంధు చెక్కులు, పాస్బుక్కుల పంపిణీ లాంటి అన్ని కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశిత సమయాన్ని కేటాయించి పనులు అప్పగించారు. అంతేగాకుండా పనులు చేపడుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించారు. రైతుబంధు చెక్కుల పంపిణీ దృష్ట్యా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. రాత్రిపగలనక పనులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. లక్ష్యం పెద్దదిగా ఉండడం, సమయం తక్కువగా ఉండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు... లక్ష్యాన్ని చేరుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసిన సాప్ట్వేర్ సక్రమంగా పనిచేయడం లేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి పనులు పూర్తి చేశామంటున్నారు. సాంకేతిక సమస్యలు, ఆన్లైన్ కనెక్షన్లు అస్తవ్యస్తంగా ఉండడం ఇబ్బందులు తప్పడం లేదని, పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొంటున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు ఉన్నతాధికారులు గ్రామాల పర్యటిస్తుండడం కూడా సిబ్బందికి తలనొప్పిగా మారింది. రివ్యూలకే రోజుల తరబడి ఫైళ్లు మోసుకుంటూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.... అసలే పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత మరో విధంగా వేధిస్తుంది. కలెక్టరేట్లో ఆరుగురు తహసీల్దార్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టే ఖాళీగా ఉంది. డీఆర్వో మణిమాల ఉద్యోగ విరమణ పొందాక ఆ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. జిల్లాలో మొత్తం 31 మంది తహసీల్దార్లు ఉండాలి. కానీ 24 మందితో వెళ్లదీస్తున్నారు. పిట్లం, నాగిరెడ్డిపేట మండలాలకు ఇన్‌చార్జీలే ఉన్నారు. భిక్కనూరు తహసీల్దార్ రిటైరవడంతో అక్కడా ఇన్‌చార్జియే పనులు చూస్తున్నారు. జిల్లాలో 42 మంది డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకుగాను 36 మందే పనిచేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 50 ఉండగా.. 22 మంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు 44 ఉండగా.. 22 మంది విధుల్లో మాత్రమే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 45కుగాను 31 మందే ఉన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కలిపి 87 మంది అటెండర్లు ఉండాల్సి ఉండగా.. 49 మంది మాత్రమే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పోస్టు వీఆర్వోది. ఒక గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు, రెవెన్యూ వ్యవహారాలు చూసుకునే బాధ్యత వారిదే.. జిల్లాలో 255 వీఆర్వో పోస్టులు ఉండగా.. 207 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో ఇన్‌చార్జీలే ఉన్నారు. దీంతో ఇన్‌చార్జీలుగా ఉన్న గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేగంగా సాగడం లేదు. జిల్లాలో వీఆర్ఏ పోస్టులు 1,523 ఉండగా.. 1,424 మంది పనిచేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల పనుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే జిల్లా రెవెన్యూశాఖలో ఉన్న ఖాళీల ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఈ ఖాళీలను, సాంకేతిక సమస్యలను పనిభారాన్ని దృష్టిలో పెట్టుకునైనా తమపై ఒత్తిడి తగ్గించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ఒత్తిడి తగ్గించకపోతే సమ్మెకైనా వెనుకాడబోమని పేర్కొంటున్నారు. -
నాకొద్దు ఈ ఉద్యోగం; మహిళా ఇన్స్పెక్టర్ రాజీనామా
సాక్షి, చెన్నై: పనిభారంతో ఓ మహిళా ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. మరో రెండేళ్లలో పదవీ విరమణ పొందాల్సిన తాను ఇన్నాళ్లు పడ్డ బాధలు, ప్రస్తుతం పడుతున్న కష్టాలను ఓ లేఖ రూపంలో ఆమె ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టినట్టు సమాచారం.రాష్ట్ర పోలీసు శాఖలో పని భారం పెరిగినట్టు గత కొంత కాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తోడు మానసిక ఒత్తిళ్లకు లోనైన వారు ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతూ వస్తున్నారు. గత నెల చెన్నై కానిస్టేబుల్ అరుణ్ రాజ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఆ ఘటన మరువక ముందే ఐనావరం స్టేషన్లోనే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మరింతగా కలకలం రేపింది. అలాగే, విధుల్లో ఉన్న వాళ్లు పనిభారం, ఒత్తిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ముగ్గురు విధుల్లోనూ గుండె పోటుతో మరణించారు. కేవలం పనిభారం కారణంగా, ఉన్నతాధికారుల వేదింపులతో అనేకచోట్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్నట్టు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనేకమంది పోలీసులు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ మద్రాసు హైకోర్టుకు సైతం చేరాయి. పోలీసు బాసులకు, హోం శాఖకు అక్షింతలు వేసే రీతిలో కోర్టు స్పందించింది. దీంతో పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించే రీతిలో యోగా తరగతులు ప్రతి వారం నిర్వహించే పనిలో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పని భారంతో తన ఉద్యోగాన్ని వదులుకుంటూ రాజీనామా చేస్తూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ లేఖ రాసి పెట్టి వెళ్లడం వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీసింది. ఆలస్యంగా వెలుగులోకి.. సెంబియం మహిళా పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఇదయ కళ పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ రాసి పెట్టి ఆమె వెళ్లి ఉండటం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అందులో పనిభారం మరింతగా పెరిగిందని, పనిచేయలేని పరిస్థితి ఉందని, సహ అధికారులు సహరించడం లేదని వివరిస్తూ, తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ తాను రాజీనామా చేస్తున్నామని అందులో ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఆమె మెడికల్ సెలవుల్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 1981లో పోలీసు శాఖలో చేరిన ఆమె 2020లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ఆమె పని భారంతో పదవిని వదలుకోవడం గమనార్హం. ఇదే రకంగా అనేక స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందే కాదు, కింది స్థాయి వారు అనేకమంది రాజీనామా అంటూ లేఖల్ని ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. -
కష్టాల కాఖీ..
పెరిగిన పని ఒత్తిడితో నాలుగో సింహం నలిగిపోతోంది. పోలీసులు సతమతమవుతున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్సైల వరకు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న జిల్లాల ఆవిర్భావం తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. కేసుల విచారణ, నిందితుల అరెస్ట్‌లో కానిస్టేబుల్ నుంచి ఎస్సైలే కీలకం కావడంతో వారికి తీరిక లేకుండాపోతోంది. జనగామ: రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కార్ నుంచి పోలీసులకు అత్యున్నతమైన గౌరవం, సౌకర్యాలు దక్కుతున్నా.. అదే స్థాయిలో రెట్టింపు కష్టాలు వేధిస్తున్నాయి. మొన్న ఇవాంక.. నిన్న ప్రపంచ తెలుగు మహాసభలు, రోజూవారీగా మంత్రుల పర్యటనలు ఇలా వరుస డ్యూటీలు చేస్తూ నలిగిపోతున్నారు. బందోబస్తుల పేరుతో జిల్లాలోని పోలీసులు పట్టుమని పది రోజులు కూడా పోలీస్టేషన్లో విధులను నిర్వర్తించ లేకపోతున్నారు. అధికారులు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనలతో అసలు డ్యూటీ మరిచిపోతున్నారు. అదనపు పని చేస్తూ.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా.. ఉన్నతాధికారులకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పోలీసులు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరుస బందోబస్తులు స్టేషన్ డ్యూటీలతోపాటు ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అవసరం ఉండడంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. ఒకరోజు ముందే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక బందోబస్తు పేరుతో పక్కజిల్లాలకు సైతం పంపిస్తున్నారు. సిబ్బంది ఇలా డ్యూటీలపై బయటికి వెళ్లడంతో లేక చాలా పోలీస్స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. గొడవలు, భూతగాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొం టున్న బాధితులు న్యాయం కోసం ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. జనవరి వరకు భారం తప్పదు జిల్లాలో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. వచ్చే ఏడాది జనవరి వరకు ఇక్కడ పని చేస్తున్న వారికి పని భారం తప్పదు. ప్రభుత్వం 38 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. తట్టుకుని పనిచేయాల్సిందే. అయినప్పటికీ శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నం. –మల్లారెడ్డి, డీసీపీ, జనగామ వీఐపీల రాకపోకలతో హైవేలపై హడావుడి ‘హలో.. హైదరాబాద్ నుంచి ఫలనా మంత్రి గారు బయల్దేరారు.. తెల్లవారుజామునే పై అధికారుల నుంచి ఫోన్. దీంతో పెంబర్తి నుంచి స్టేషన్ ఘన్పూర్ చిన్నపెండ్యాల వరకు హైసెక్యూరిటీ. వెంటనే మరో మంత్రి.. ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారుల పర్యటనలు.. హైవేపై పోలీసులు చక్కర్లు కొడుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్, అపరిచిత వ్యక్తులపై నిఘా రోజూ చేయాల్సిన పనే. అటుగా వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు.. కంటిపై రెప్పవాల్చకుండా 24 గంటలపాటు విధులు నిర్వర్తించాల్సిందే. ఈ బందోబస్తులకు తోడు సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలను కట్టడి చేయాల్సిన డ్యూటీ కూడా పోలీసులదే. బందోబస్తు డ్యూటీలు ముగించుకొని అలసిపోయి తీరా స్టేషన్‌కు వెళ్లేసరికి ‘సారూ పొద్దుగాల వచ్చిన.. మా కేసు ఏమైందంటూ’ ఆవేదన వెలిబుచ్చే బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఇంత పని ఒత్తిడిలోనూ కేసుల నమోదు, విచారణ, నిందితుల కోసం గాలింపు, కోర్టుకు తరలింపు, కేసుల క్లియరెన్స్‌కు ఉన్నతాధికారుల టార్గెట్లు ఉండనే ఉంటాయి. దీంతో కానిస్టేబుళ్లు, అధికారులు బాధను దిగమింగుకుని విధులు నిర్వరిస్తున్నారు.