X5 models
-
కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ బీఎండబ్లు్య కొత్త వేరియంట్లలో ఎస్యూవీ ఎక్స్5 ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.77.9 లక్షల నుంచి ప్రారంభం. పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టేబుల్ రోలర్ సన్‌బ్లైండ్స్ వంటివి పొందుపరిచారు. ఎక్స్‌డ్రైవ్30డీ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్, 265 హెచ్‌పీ, 620 ఎన్ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. ఎక్స్‌డ్రైవ్40ఐ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 340 హెచ్‌పీ, 450 ఎన్ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది. -
బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎక్స్5 మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ మోడళ్లు ఎక్స్3, ఎక్స్5లలో పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.54.9 లక్షలు, రూ.73.5 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. తాజా రెండు పెట్రోల్ వేరియంట్లు చెన్నైలోని ప్లాంటులోనే తయారయ్యాయని కంపెనీ పేర్కొంది. ఎక్స్3లో 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్, ఎక్స్5లో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరిచినట్లు తెలిపింది. 2 వేరియంట్లలో 8 స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ట్రాన్సమిషన్, ఆల్‌వీల్ డ్రైవ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది.