బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎక్స్5 మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు | BMW launches X3, X5 models with petrol powertrains | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎక్స్5 మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు

Published Thu, Dec 8 2016 1:58 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎక్స్5 మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు - Sakshi

బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎక్స్5 మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ మోడళ్లు ఎక్స్3, ఎక్స్5లలో పెట్రోల్ వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.54.9 లక్షలు, రూ.73.5 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. తాజా రెండు పెట్రోల్ వేరియంట్లు చెన్నైలోని ప్లాంటులోనే తయారయ్యాయని కంపెనీ పేర్కొంది. ఎక్స్3లో 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్, ఎక్స్5లో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరిచినట్లు తెలిపింది. 2 వేరియంట్లలో 8 స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ట్రాన్‌‌సమిషన్, ఆల్‌వీల్ డ్రైవ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement