హెల్మెట్‌ లేకుండా బైక్‌ రైడింగ్‌ సన్నివేశం చిత్రీకరణ | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ లేకుండా బైక్‌ రైడింగ్‌ సన్నివేశం చిత్రీకరణ

Published Tue, May 14 2024 7:00 AM

హెల్మెట్‌ లేకుండా బైక్‌ రైడింగ్‌ సన్నివేశం చిత్రీకరణ

సినీ డైరెక్టర్‌కు జరిమానా

దొడ్డబళ్లాపురం: ఒక మహిళ హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతుంటుంది. ఇక ఒక సీరియల్‌లోని సన్నివేశం. ఈ దృశ్యాన్ని చూసిన వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీరియల్‌ డైరెక్టర్‌కి జరిమానా విధించారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. సీతారామ అనే కన్నడ సీరియల్‌లో 14వ ఎపిసోడ్‌లో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న లేడీ ఆర్టిస్టు హెల్మెట్‌ ధరించలేదని మంగళూరుకు చెందిన జయప్రకాశ్‌ అనే సామాజిక కార్యకర్త 2023 ఆగస్టు 24న బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. కద్రి నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు విచారణ జరిపి సదరు టీవీ చానల్‌ డైరెక్టర్‌ మోహన్‌ కుమార్‌, లేడీ ఆర్టిస్టు, ద్విచక్ర వాహనం ఓనర్‌, సీరియల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌కు నోటీసులు ఇచ్చి వివరణ అడిగారు. ఆ షూటింగ్‌ బెంగళూరులోని నందిని లేఔట్‌లో జరగడంతోకేసును నందిని లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇకపై ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించబోమని సీరియల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించనందుకు ఈనెల 10న సినీ డైరెక్టర్‌కు రూ.500 జరిమానా విధించారు. అందుకు సంబంధించిన రసీదు కాపీని సామాజిక కార్యకర్త జయప్రకాశ్‌కు పంపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement