కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్
పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్
ఆదిలాబాద్: గత పదేళ్లలో అవినీతి రహిత పాలనను అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రరాజ్యాలకు ధీటుగా తీసుకెళ్లిన ప్రధాని మోదీకి నేనేందుకు మద్దతివ్వకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక తొలి సారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు మావల బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు.
మావల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూ, పార్టీ ప్రతిష్టతను పెంచేలా పనిచేస్తాన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీయే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అమర్‌సింగ్ తిలావత్, అశోక్ ముస్తాపురే, నగేష్, విజయ్, జ్యోతిరెడ్డి, కృష్ణయాదవ్, వేదవ్యాస్, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యనేతల గైర్హాజరు!
సమావేశానికి పార్టీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్‌తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులేవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక నిర్వహించిన తొలి సమావేశానికి ముఖ్య నేతలు డూమ్మకొట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇవి చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ!
Comments
Please login to add a commentAdd a comment