‘బెల్టు’ జోరు
● వైన్స్‌ల నుంచే నేరుగా సరుకు ● రొటేషన్ పద్ధతిలో తరలింపు ● ప్రతినెలా రూ.2.25 కోట్ల లిక్కర్ లక్ష్యం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో బెల్టుషాపుల దందా జోరుగా సాగుతోంది. నేరుగా వైన్సుల నుంచే స రుకు తరలుతుండడంతో విక్రయాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. క్వార్టర్‌కు ఎమ్మార్పీ పై రూ.20, అలాగే బీర్‌కు రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వీటికి తోడు లూజ్ సేల్స్ ఉంటాయి. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది వరకు, పట్టణాల్లో అయితే ఒక్కో వార్డులో 10కి పైబడి ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారంటే దందా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణంలోని మురికివాడలు, గ్రామాల్లోని షాపులు, హో టళ్లు, కొన్నిచోట్ల ఇళ్లలోనే వీటి నిర్వహణ కొనసాగుతుంది. చీప్‌లిక్కర్, కొంత మధ్యస్థాయి లిక్కర్‌తోపాటు బీర్లు అందుబాటులో ఉంటాయి. అయి తే ఇక్కడికి వచ్చేవారు సామాన్యులే అధికం. రోజు వారి కూలీ పనులు ముగిసిన తర్వాత వచ్చే వారి నుంచి నిర్వాహకులు ఎమ్మార్పీకి మంచి వసూలు చేస్తుంటారు. అలాగే సీల్ క్వార్టర్ కా కుండా లూజ్‌గా బాటిల్‌నుంచి పోసి విక్రయిస్తుండడం ఇక్కడ కామన్. నిబంధనలప్రకారం వైన్సు ల్లోనే లిక్కర్ అమ్మకాలు జరగాల్సి ఉండగా, అధిక లాభం కోసం మద్యం వ్యాపారులే బెల్టుషాపులను ప్రోత్సహించడం, దానికి ఎక్సైజ్ అధి కారులు వంతపాడటం గమనార్హం.
రొటేషన్ పద్ధతి..
జిల్లా కేంద్రంలో పది వైన్స్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రా మాల బెల్టుషాపులకు చీప్ లిక్కర్ తరులుతుంది. ఈ వ్యవహారంలో రొటేషన్ పద్ధతిని అవలంభిస్తున్నారు. దాని ప్రకారం ప్రతినెలా కేవలం మూడు వైన్సుల్లోనే చీప్‌లిక్కర్ సరుకు బెల్టుషాపు నిర్వాహకులకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతినెలా ఆ మూడు షాపులు మారుతుంటాయి. ఒక్కో షాపునకు నెలకు రూ.75లక్షలు లక్ష్యం. ఈ లెక్క న మూడు షాపుల ద్వారా ప్రతినెలా రూ.2.25 కోట్ల చీప్‌లిక్కర్ అమ్మడం వారి టార్గెట్. ఇలా రొటేషన్ పద్ధతిలో సాగే ఈ వ్యాపారంలో లాభా లను సిండికేట్ ద్వారా అన్ని షాపులకు సమానంగా పంచడం జరుగుతుంది. ఆదిలాబాద్ సర్కిల్‌లో ఓ ఎకై ్సజ్ అధికారి ఇటు వైన్స్‌షాపుల్లో అనధికారిక వేళల్లో మద్యం విక్రయాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు బెల్టుషాపుల నుంచి వచ్చే అక్రమ ఆదాయం కోసం ఇక్కడ అదనపు దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం..
బెల్టుషాపులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. అయినప్పటికీ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం.
– హిమశ్రీ, డీపీఈవో,
ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment