దళారులకు అమ్మి మోసపోవద్దు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): సోయా పంట దిగుబడిని రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును సోమవారం ఆయన సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. సోయా మద్దతు ధర రూ.4,892 ఉందని తెలిపారు. రైతులు పంటను ఎండబెట్టి తీసుకురావాలని, తేమ శాతం 12 శాతం లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా చేపట్టాలని క లెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జైనథ్ మండల కేంద్రంలో సర్వే తీరును పరిశీలించారు. కుటుంబ సమగ్ర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీవో రాజు, తహసీల్దార్ శ్యామ్‌సుందర్ తదితరులున్నారు.
● కలెక్టర్ రాజర్షిషా
Comments
Please login to add a commentAdd a comment