పాడి రైతులను ప్రోత్సహించాలి
కైలాస్నగర్: జిల్లాలో పాడి రైతులను ప్రో త్సహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తన చాంబర్లో విజయ డెయిరీ ఉత్పత్తుల కు సంబంధించిన కరపత్రాలను సోమవా రం ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు నమూనా పాల సేకరణ కేంద్రాలను గ్రామీ ణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. బేల, ఇచ్చోడ మండలాల్లో పాల సేకరణ మరింత పెంచాలన్నారు. జిల్లా కేంద్రంలో ని బస్టాండ్, రిమ్స్ వంటి ప్రాంతాల్లో డెయి రీ పార్లర్లను ప్రారంభించాలని సూచించా రు. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా విజయ డెయిరీ పాల ఉత్పత్తులు ఆదరించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న, డీసీవో మోహ న్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, మేనేజర్ దస్రు, పంపిణీదారు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment