పూలే దంపతుల జయంతి, వర్ధంతిని నిర్వహించాలి
ఆదిలాబాద్‌రూరల్: మహాత్మా జ్యోతి బాపూలే దంపతుల జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో శనివారం పూలే దంపతుల విగ్రహాల ముందు జిల్లా అధ్యక్షుడు వాడగురే విజయ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కలెక్టర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు పోస్ట్ ద్వారా పంపే ఉత్తరాలను ప్రదర్శించారు. ఈనెల 28న జరిగే జ్యోతిబాపూలే వర్ధంతిని, వచ్చే జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment