రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్‌

Published Sun, Nov 24 2024 6:41 PM | Last Updated on Sun, Nov 24 2024 6:41 PM

రిమ్స

రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు శనివారం అరుదైన ఆపరేషన్‌ చేశారు. అంకాలజిస్టు డాక్టర్‌ జక్కుల శ్రీకాంత్‌, ఈఎన్టీ సర్జన్‌ సత్యనారాయణ, అనస్తీషియా బృందం సుమారు గంటన్నర పాటు శ్రమించి ఓ వృద్ధురాలి మెడలో ఉన్న థైరాయిడ్‌ కణితిని విజయవంతంగా తొలగించారు. అనంతరం వైద్యుడు శ్రీకాంత్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన వృద్ధురాలు నర్సవ్వ మెడలో థైరాయిడ్‌ కణితితో బాధపడుతోంది. ఈనెల 11న రిమ్స్‌లో చేరగా ఈఎన్టీ సర్జన్‌ సత్యనారాయణ పరిశీలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి థైరాయిడ్‌ కణితి ఉందని గుర్తించారు. బయట నుంచి అది 500 గ్రాములు కనిపించిందన్నారు. ఆపరేషన్‌ చేసి తీసేసరికి అది కిలోన్నర బరువు ఉందన్నారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ సూచనతో ఆపరేషన్‌ను విజయవతంగా పూర్తి చేశామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్‌1
1/1

రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement