కొన్ని జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. హోదా పెరి
● ఐజీ రమేశ్ జ్ఞాపకాల్లో ఏఎస్సై బాబర్ ● 27 ఏళ్ల క్రితం ప్రొబేషనరీ శిక్షణ అనుభవాలు ● ఆదిలాబాద్‌కు విచ్చేసిన ఉన్నతాధికారి ● ‘దీక్షాంత్’లో నాటి రోజులను గుర్తు చేసిన ఆఫీసర్
సరిగ్గా ఇరవై ఏడేళ్ల క్రితం.. అంటే 1997లో ఎం.రమేశ్ హైదరాబాద్ రాజ్‌బహదూర్ వెంకట్రాంరెడ్డి పోలీసు అకాడమీ నుంచి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొదట డీఎస్పీ హోదాలో ప్రొబేషనరీ శిక్షణ తీసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే.. కానిస్టేబుల్ నుంచి ఎస్సై, సీఐల బాధ్యతలు ఎలా ఉంటాయి.. ఎలా నిర్వర్తిస్తారు.. కేసుల విచారణలో ఎలా ముందుకు వెళ్లారు.. అనే అంశాలను ఆ పోస్టుల్లో పరకాయ ప్రవేశం చేసినట్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐపీఎస్ రమేశ్‌ను ఈ ప్రొబేషనరీలో భాగంగా పోలీసు శాఖ ఆదిలాబాద్ వన్‌టౌన్‌కు పంపించింది. ఇక్కడ కానిస్టేబుళ్ల విధులు తెలుసుకునే విషయంలో అప్పుడు వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న బాబర్ మీర్జా బేగ్‌ను ఐపీఎస్‌కు అటాచ్డ్ చేశారు. ఆరు నెలల పాటు జిల్లాలోనే ఉన్న రమేశ్‌తో బాబర్ వెన్నంటి ఉన్నాడు. శిక్షణలో సెంట్రీ డ్యూటీ, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఆస్పత్రికి క్షతగాత్రులు వస్తే విధులు ఎలా నిర్వర్తించడం, దర్యాప్తు అధికారికి కానిస్టేబుల్ ఎలా సహకరించాలని, పంచనామా రాయడం, చిన్న చిన్న నేరాలు జరిగినప్పుడు దర్యాప్తు అధికారితో వెళ్లి సాక్షుల వాంగ్మూలం సేకరించడం.. అటు పై ఎస్సై, సీఐ విధుల నిర్వహణ విషయంలోనూ అనుభవం పొందారు.
సార్ వస్తున్నారని..
గత గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ కార్యక్రమంలో భాగంగా దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐజీ రమేశ్ వస్తున్నారని తెలిసిన వారు ముందే బాబర్‌కు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాబర్ ప్రస్తుతం కుమురం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐజీ రమేశ్ వస్తున్నారని, తనకు సార్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జైనూర్ ఎస్సై సాగర్‌ను అనుమతి కోరి గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పోలీసు క్లబ్‌లో ఆగిన ఐజీని నేరుగా కలిశాడు. ఆ సమయంలో ఐజీ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా అప్పట్లో ఆదిలాబాద్ టౌన్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న సురేందర్‌రెడ్డి, సీఐ సాయిలు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో ఉండగా ఐజీ వీడియో కాన్ఫరెన్స్‌లో వారితో మాట్లాడారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పరేడ్ వేదికపై నుంచి..
కొత్త కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఐజీ రమేశ్ దీక్షాంత్ పరేడ్ వేదికపై నుంచి మాట్లాడారు. ‘ఆది లాబాద్ జిల్లా అంటే నాకెంతో ఇష్టం.. ఎందుకంటే నా మొదటి అడుగులు పోలీసు శాఖలో ఇక్కడి నుంచే మొదలయ్యాయి.. ఆ రోజు ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో చక్కటి అనుభవం గడించాను.. ఆ సమయంలో కానిస్టేబుల్ బాబర్ నాకు అటాచ్డ్ గా విధులు నిర్వర్తించాడు.. ఆ సమయంలో కేసుల దర్యాప్తులో ఎంతో అనుభవం గడించాను.. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న మీకు కూడా ఇలాంటి మంచి జ్ఞాపకాలు, అనుభూతులు నిలువాలి’.
సార్ తన్మయం చెందారు..
పోలీసు క్లబ్‌లో ఐజీ రమేశ్ సార్‌ను కలిసినప్పుడు ఆయన తన్మయం చెందా రు. తన పక్కనున్న వారితో నా గురించి చెప్పా రు. ‘ఆసిఫాబాద్ నుంచి నన్ను కలిసేందుకు వచ్చాడని, ప్రొబేషనరీ శిక్షణలో నాకు అటాచ్డ్‌గా ఉన్నాడని’ అన్నారు.
– బాబర్, ఏఎస్సై
Comments
Please login to add a commentAdd a comment