నాణ్యమైన భోజనం అందించాలి
కై లాస్నగర్: పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం హైదరాబా ద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు సునీత, రాజలింగు, డీఈవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment