‘ఎమ్మెల్సీ’ ముసాయిదా జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్సీ’ ముసాయిదా జాబితా విడుదల

Published Sun, Nov 24 2024 6:41 PM | Last Updated on Sun, Nov 24 2024 6:41 PM

‘ఎమ్మెల్సీ’ ముసాయిదా జాబితా విడుదల

‘ఎమ్మెల్సీ’ ముసాయిదా జాబితా విడుదల

● జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 13,405 ● ఉపాధ్యాయ ఓటర్లు 1401 ● 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

కై లాస్‌నగర్‌: త్వరలో నిర్వహించనున్న మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఈసీ (ఎలక్షన్‌ కమిషన్‌) ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి శనివారం విడుదల చేశారు. జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 13,405 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,308 మంది ఉండగా మహిళా ఓటర్లు 4,097 మంది ఉన్నారు. అలాగే ఉపాధ్యాయ ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 1,401 మంది ఉండగా అందులో పురుషులు 975 మంది , మహిళలు 426 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్యాలయం, ఉట్నూర్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచారు. పట్టభద్రుల ఓటర్లతో పోల్చితే ఉపాధ్యాయ ఓటర్ల నమోదు తక్కువగా ఉండగా, మహిళా ఓటర్ల నమోదు మరీ తక్కువగా ఉండటం గమనార్హం.

డిసెంబర్‌ 9వరకు అభ్యంతరాల స్వీకరణ

శనివారం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 9వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నిర్ణీత గడువులోగా దీనిపై అందిన అభ్యంతరాలు, ఓటర్‌ క్లెయిమ్స్‌ను డిసెంబర్‌ 25లోగా పరిష్కరించి డిసెంబర్‌ 30న తుది జాబితాను ప్రకటించనున్నారు.

ఓటరు నమోదుకు మరో అవకాశం

ఇప్పటి వరకు మండలి ఓటరుగా నమోదు చేసుకోలేనటువంటి ఉపాధ్యాయులు, పట్టభద్రులకు మరో అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 9వరకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లోనూ ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టభద్రులు ఫారం–18 ద్వారా, ఉపాధ్యాయులు ఫారం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

జిల్లాలోని మండలి ఓటర్ల వివరాలు

పట్టభద్రులు రెవెన్యూడివిజన్‌ పురుషులు మహిళలు మొత్తం

ఉట్నూర్‌ 1,270 519 1,789

ఆదిలాబాద్‌ 8,038 3,578 11,616

ఉట్నూర్‌ 163 71 234

ఆదిలాబాద్‌ 812 355 1,167

టీచర్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement