దివ్యాంగులను ప్రోత్సహించాలి
వాతావరణం
రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమ శాతం పెరగనుంది.
ఆదిలాబాద్: దివ్యాంగులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు ఆసక్తి ఉన్న అంశంలో ప్రోత్సాహం అందిస్తే సకలాంగులకు దీటుగా రాణిస్తారన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఎంపీకి విన్నవించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో సబిత, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారధి, ఏసీడీపీవో మిల్కా, రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు రఘుపతి, పెటా ప్రధాన కార్యదర్శి స్వామి, రాజేశ్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, కబీర్ దాస్, సంఘం నాయకులు పాల్గొన్నారు.
అనంతరం స్టేడియంలో గల మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ ఫీల్డ్‌ను ఎంపీ నగేశ్ పరిశీలించారు. ఆస్‌ట్రో టర్ఫ్ హాకీ కోర్టు, సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట రైల్వే బోర్డుమెంబర్ రఘుపతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, డివైఎస్‌వో వెంకటేశ్వర్లు, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రాష్ట్రపాల్, కబీర్‌దాస్, తుకారాం, నర్సయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment