గజగజ
జిల్లా కేంద్రంలో చలిమంట కాగుతున్న జనం
ఆదిలాబాద్‌టౌన్: భిన్నమైన వాతావరణానికి నెలవైన జిల్లాను చలి పులి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, శీతల గాలులు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వేకువజామున బయటకు వచ్చే పాల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు చలికి వణికిపోతున్నారు. ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత అధికం. నేరడిగొండ మండలంలో శనివారం 10.8 డిగ్రీల సెల్సీయస్ నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్వెట్టర్లకు పెరిగిన గిరాకీ..
చలి తీవ్రత పెరగడంతో ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో వెలిసిన స్వెట్టర్ల దుకాణాల్లో గిరాకీ పెరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్, రాంలీలా మైదానం, పంజాబ్ చౌక్ తదితర ప్రాంతాల్లో దుకాణాలు వెలిశాయి. అలాగే ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ స్వెట్టర్లు, బ్లాంకెట్లను విక్రయిస్తున్నారు. దీంతో ఉన్ని దుస్తుల వ్యాపారం జోరందుకుంది.
కై లాస్‌నగర్: గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూ తన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక టీఎన్జీవోస్ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూ రి శ్రీనివాసరావు, సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.శివకుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి.ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా జి.రాజేషుడు, ఎస్.వామన్‌రా వు, పి.అరుణ, కార్యదర్శిగా రాథోడ్ రామారావు, జాయింట్ సెక్రెటరీలుగా కె.అనిల్, పి.నరేష్, జి. వినూత్న, కోఽశాధికారిగా శ్రీనివాస్ రొడ్డ, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కె.మల్లేశ్, ప్రచార కార్యదర్శిగా ఆర్. సంతోష్,ఆఫీస్ సెక్రెటరీగా ఆడె ధర్మేందర్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రెటరీగా వై.శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ స భ్యులుగా భగత్ రమేశ్, చంద్రశేఖర్, సరోజ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సత్కరించి నియామకపత్రాలు అందజేశారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో టీఎన్జీ వోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న శ్రీనివాసరావు
జిల్లాను వణికిస్తున్న చలి పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం 10.8 డిగ్రీ సెల్సీయస్ నమోదు
పెరిగిన చలి
జిల్లాలోని ఆయా మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. నేరడిగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 10.8 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. అలాగే బజార్‌హత్నూర్‌లో 11, బోథ్ మండలంలోని పొచ్చెరలో 11.4, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పల్‌దరిలో 11.8, బోథ్ మండలం సోనాలలో 11.9, బేలలో 11.7, భీంపూర్ మండలంలోని అర్లి–టిలో 11.8, ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌లో 12.5, జైనథ్‌లో 12.7, ఇంద్రవెల్లిలోని హీరాపూర్‌లో 12.8, బేలలోని చెప్రాలలో 12.4 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment