ప్రధానిపై నమ్మకంతోనే బీజేపీకి పట్టం
ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతోనే మహారాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్య మంత్రి, మంత్రులు ప్రచారం చేసినా, వారిని ప్రజలు నమ్మలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, లాలామున్నా, దినేష్ మటోలియా, కృష్ణయాదవ్, రాజేశ్, శ్రీనివాస్, రఘుపతి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment