విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం

Published Sun, Sep 15 2024 2:54 AM | Last Updated on Sun, Sep 15 2024 2:54 AM

విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం

నాటుపడవపై వైర్లు తరలింపు

సీలేరు: తుపాను గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించడంతో ఎక్కడికక్కడ రోడ్లు ,వంతెనలు కొట్టుకుపోయాయి. మారుమూల గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా గ్రామాలకు విద్యుత్‌ లైన్లు దెబ్బతినడంతో ఐదు రోజులుగా సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ పనిచేయడం లేదు. దుప్పులవాడ పంచాయతీ పిల్లిగెడ్డ వాగును ఆనుకుని ఉన్న మారుమూల గ్రామాల్లో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కొమ్మరాపల్లి, జొన్నమామిడి, పిల్లిగెడ్డ, కాట్రగడ్డ, సంతనేరేడుపల్లి తదితర గ్రామాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయి. పిల్లిగెడ్డపై వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ వైర్లు, మెటీరియల్‌ను గ్రామాలకు తరలించే అవకాశం లేకపోవడంతో నాటుపడవలపై తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు ముందుకువచ్చారు. విద్యుత్‌ సిబ్బంది గ్రామాలకు వెళ్లి విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటుచేశారు. వీటికి సంబంధించిన వైర్లు, ఇతర సామగ్రిని ఆయా గ్రామాల ప్రజలు నాటుపడవపై తీసుకువెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement