అథ్లెటిక్స్‌ పోటీల్లో అరకు విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ పోటీల్లో అరకు విద్యార్థుల ప్రతిభ

Published Fri, Oct 11 2024 1:30 AM | Last Updated on Fri, Oct 11 2024 1:30 AM

అథ్లెటిక్స్‌ పోటీల్లో అరకు విద్యార్థుల ప్రతిభ

బంగారు పతకాలు సాధన

అరకులోయ టౌన్‌: రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శెట్టి లోహిత్‌, టి.గోపాలకృష్ణ ప్రతిభ కనబరిచారు.ఈనెల 4, 5, 6 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ పోటీల్లో కళాశాలకు చెందిన శెట్టి లోహిత్‌ 200 మీటర్ల పరుగు పందెంలో కేవలం (22.47 సెకెన్లు), 400 మీటర్ల పరుగు పందెంలో 50 సెకెన్లలో పూర్తి చేసి ప్రథమస్థానం కై వసం చేసుకున్న బంగారు పతకం సాధించాడు. గోపాలకృష్ణ లాంగ్‌ జంప్‌లో 6.81 మీటర్లు దూకి ప్రథమ స్ధానంలో నిలిచి బంగారు పతకం పొందాడు. వీరిద్దరు ఈనెల 17,18,19, తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే సౌత్‌ జోన్‌ నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ భరత్‌కుమార్‌ తెలిపారు. వీరిని ఆయనతోపాటు స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి పసుపులేటి నాగబాబు, పీడీ సమర్ధి అప్పారావు, అధ్యాపకులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement