హైవే పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: జాతీయ రహదారి పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. గురువారం ఆయన ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ నిర్మిస్తున్న జాతీయ రహదారి–326 పనులను డీఎఫ్‌వో బబితతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల పట్టాలకు సంబంధించి సమస్యలుంటే ఐటీడీఏకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుయిగూరులో మిర్చి పంటను పరిశీలించిన పీవోకు తమకు ఐటీడీఏ ద్వారా డీజిల్ ఇంజన్లు మంజూరు చేయాలని రైతులు కోరారు. నాలుగు మండలాల్లో ఇంజన్లు కావాల్సిన రైతుల వివరాలు సేకరించి నివేదిక అందచేయాలని ఆయన హర్టికల్చర్ అధికారులను ఆదేశించారు. అనంతరం పీవో మండలంలోని ఎర్రగొండపాకలలో మల్బరీ పైరును పరిశీలించారు. సంబంధిత రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పంట ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. తులసిపాక పీహెచ్‌సీని పరిశీలించిన ఆయన అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment