మెరుగైన దిగుబడి సాధనకు సహకారం
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గిరిజన రైతులకు వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధించేలా సహాయ, సహకారాలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సూచించారు. బుధవారం ఆయన పందిరిమామిడి కేవీకేలో గిరిజన మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కేవీకేలో మత్స్యవిభాగం శాస్త్రవేత్త కె.వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ ఏడాది బొచ్చు, రాగండి, అమూర్‌కార్ప్ చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వాటికి సరియైన పోషకాలు అందించగలిగితే ఆరునుంచి ఎనిమిది నెలల కాలంలో కిలో బరువు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే అధిపతి డా. కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment