ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి
చింతపల్లి: పీఎం జన్‌మన్ పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వాటిని సకాలంలో పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ బాబు కోరారు. బుధవారం ఆయన మండలంలోని కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామంలో పర్యటించారు. గృహ నిర్మాణాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. మండలానికి 2674 ఇళ్లు మంజూరుకాగా వీటిలో 1207 బేస్‌మెంట్ లెవెల్, 235 రూప్ లెవెల్, 23 శ్లాబ్ దశలో ఉన్నాయన్నారు. హౌసింగ్ ఏఈఈ రమణ, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజారావు పాల్గొన్నారు.
జి.మాడుగుల: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీ బాబు అదేశించారు.బుధవారం ఆయన మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ పరదేశిపుట్టు ఆదివాసీ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. పీవీటీజీ గిరిజనుల ఇళ్లకు సంబంధించి నిధులు పుష్కలంగా ఉన్నాయని, త్వరిత గతిన నిర్మాణాలు చేపడితే బిల్లులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఏఈ డి. ఈశ్వరరావు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
హౌసింగ్ పీడీ బాబు
Comments
Please login to add a commentAdd a comment